వైయ‌స్‌ జగన్‌ను కలిసిన స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు

విశాఖ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు క‌లిశారు. ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ విశాఖ జిల్లాలో ప‌ర్య‌టిస్తుండ‌గా  స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు క‌లిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని  భరోసా ఇచ్చారు.  

న‌మ్మి ఓట్లు వేస్తే మోసం చేశారు
కూటమి నేతలను నమ్మి ఓటు వేసినందుకు తమను నిలువునా మోసం చేశారని గంగపుత్రుల ఆవేదన వ్య‌క్తం చేశారు. విశాఖ ప‌ర్య‌ట‌న‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ను బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్ బాధితులు క‌లిశారు. కాలుష్య కారక పరిశ్రమలు తమకు వద్దని మత్స్యకారులు వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తెచ్చారు. నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు తరలి వచ్చి వైయ‌స్ జ‌గ‌న్‌కు త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. బల్క్‌ డ్రగ్‌ పార్క్ ను అడ్డుకోవాల‌ని బాధితులు విన‌తిప‌త్రం అంద‌జేశారు. జి.భీమవరం వద్ద పోలీసులు మత్స్యకారులను అడ్డుకున్నారు. వైయ‌స్‌ జగన్‌ను కలిసేందుకు అనుమతి లేదంటూ వెన‌క్కి పంపించే కార్య‌క్ర‌మానికి తెర‌లేప‌గా, వైయ‌స్ జగన్‌ను కలిసి తీరుతామని మ‌త్స్య‌కారులు  స్పష్టం చేశారు. 

Back to Top