అనంతపురం: వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని రాష్ట్ర స్త్రీ , శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలతో వైయస్ఆర్‌సీపీ పాలనపై ప్రజల్లో బలమైన నమ్మకం ఏర్పడిందన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడప వద్ద ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల్లో మమేకమైన పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరిగి ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.65 కోట్ల ఇళ్లకు పార్టీ సైన్యం వెళ్తోందన్నారు. సుమారు 7 లక్షల మంది పార్టీ సైనికులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథలు ఇంటింటికీ వెళ్తారని పేర్కొన్నారు. జగనన్న ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికి తేడాలను పోల్చి వివరిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పథకాలు అందించారని విమర్శించారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ప్రజా మద్దతు పుస్తకంలో ప్రజల స్పందనను నమోదు చేసుకుంటారన్నారు. ఇంటి యజమాని అంగీకరంతో ఇంటి తలుపుకు, సెల్‌ఫోన్లకు మా నమ్మకం నువ్వే జగనన్న స్టిక్కర్లు అతికిస్తారని తెలిపారు. ప్రజల మొబైల్ నుంచి 82960 82960 నంబర్‌కి మిస్డ్ కాల్ ద్వారా జగనన్న కీలక సందేశం ప్రజలకు అందిస్తారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పాలనపై ప్రజాభిప్రాయం చేపట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజల గుండ్లెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు . సమావేశంలో ఎంపీపీ మారుతమ్మ, మార్కెట్ యార్డు చైర్ పర్సన్ బిక్కి నాగలక్ష్మి, అర్బన్ సచివాలయ కన్వీనర్ అర్చనలు ఉన్నారు.