పార‌ద‌ర్శ‌కంగా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు

మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌
 

అనంత‌పురం:  సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో ఎక్క‌డా కూడా లంచాలు, వివ‌క్ష లేకుండా పార‌ద‌ర్శ‌కంగా త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంద‌ని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ అన్నారు.  కులం చూడలేదు, పార్టీ చూడలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ  సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని మంత్రి కోరారు. స్వయం ఉపాధిని అత్యధికంగా ప్రోత్సహిస్తున్న రవాణా రంగానికి ఊతమిస్తూ, డ్రైవరన్నలకు అండగా.. వరుసగా నాలుగో ఏడాది...వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2,61,516 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున 261.51 కోట్ల ఆర్థిక సహాయాన్ని నేడు విశాఖపట్నంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారు. ఇందులో భాగంగా అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ సమీపంలోగల కృష్ణకళామందిర్ నందు జిల్లా స్థాయి  ష‌వై.య‌స్.ఆర్ వాహనమిత్ర" లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందచేసే కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు  కె.వి.ఉషాశ్రీ చరణ్ పాల్గొన్నారు.  అనంతపురం జిల్లాలో  వై.య‌స్.ఆర్ వాహనమిత్ర" పథకం కింద నాల్గవ విడతలో 8,093 మంది అర్హులైన లబ్ధిదారులకు 10 వేల రూపాయల చొప్పున 8.09 కోట్ల రూపాయల చెక్కును మంత్రి అంద‌జేశారు.

Back to Top