రాష్ట్ర అభివృద్ధికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అనేక సంస్కరణలు

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు

బాప‌ట్ల‌: రాష్ట్ర అభివృద్ధికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అనేక సంస్కరణలు చేప‌డుతున్నార‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.  రాష్ట్రంలో భూ సర్వే పూర్తిచేసి సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. రేపల్లె నియోజకవర్గ కేంద్రం లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోకోటి రూపాయలతో నిర్మించనున్న ఇన్ డోర్ స్టేడియంను, 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రైతు బజార్ కు శంఖుస్థాపన  శంఖుస్థాపన చేశారు. మరియు రెవెన్యూ డివిజనల్ ఆఫీసు కార్యాలయాన్నిరాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, దేవాదాయ శాఖ,  ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ,రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి,రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రారంభించారు. 
ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో భూ సమస్యల వల్ల పేద ప్రజలకు ,రైతులకు నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి భూముల సర్వే కార్యక్రమం చేపట్టారన్నారు. రాష్ట్రంలో భూ సర్వే ,రెవెన్యూ రికార్డులు నవీకరించి   స్వచ్చమైన టైటిల్స్ ప్రజలకు అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో లక్ష 65 వేల కోట్ల రూపాయల తో  అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి అమలు  చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు అర్హతే ప్రామాణికము సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు.రాష్ట్రంలో రైతుల సంక్షేమ కోసం రైతు పెట్టుబడి అందించడము జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వికేంద్రీకరణ చేపట్టి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. బాపట్ల జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. జిల్లాలో ఏరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మెరుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. రేపల్లె, వేమూరు నియోజకవర్గాల ప్రజల  సౌకర్యం కోసం ముఖ్యమంత్రిని రేపల్లె రెవెన్యూ డివిజన్ కావాలని కోరిన మేరకు ముఖ్యమంత్రి వెంటనే అంగీకరించి డివిజన్ ను మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ రేపల్లె నియోజకవర్గాన్ని బాపట్ల రెవెన్యూ డివిజన్ లో ఉండటం వల్ల ఈ ప్రాంతం ప్రజలకు చాల ఇబ్బంది పడతారని గమనించి రేపల్లె, వేమూరు నియోజకవర్గాలను కలిపి రేపల్లె రెవెన్యూ డివిజన్ చేయాలని ముఖ్యమంత్రి ని కోరిన వెంటనే మంజూరు చేశారన్నారు. రేపల్లె డివిజన్ లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రేపల్లె ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి370 కోట్ల రూపాయలతో నిజాంపట్న హార్బర్ రెండవ దశ పనులు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా675 అక్వా రైతులకు సాగు సర్టిఫికెట్ లను మంత్రులు రైతులకు పంపిణీ చేశారు.   

Back to Top