అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు 

రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్ప‌ల రాజు

శ్రీ‌కాకుళం:  అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామ‌ని, రాష్ట్ర ప్రజానీకం సంక్షేమమే సీఎం వైయ‌స్ జ‌గ‌న్  ధ్యేయమ‌ని రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్ప‌ల రాజు అన్నారు. పూండీ-గోవిందపురం పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ సీదిరి

కులం,మతం, వర్గం, ప్రాంతం వంటి వాటికి అతీతంగా ప్రజా సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల అవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక, మత్స్య శాఖ,పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.ఈరోజు వజ్రపుకొత్తూరు మండలం పూండి గోవిందపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన వారికి క్రొత్త పధకాల కోసం మాట్లాడారు.అలాగే ప్రభుత్వ పధకాలు ఏమేరకు ప్రజలకు అందుతున్న విషయమై ఇంటింటికి వెళ్లి ఆరా తీశారు. మధ్యవర్తులు లేకుండా,దళారీ వ్యవస్థకు దూరంగా గ్రామాల్లో సామాజిక పింఛన్లు పొందటంతో, అర్హులైన వారు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు.ఒకప్పుడు సామాజిక పింఛన్ ఒక పార్టీ వర్గానికి చెందినవారికే అధికంగా దక్కేవన్నారు.జగన్మోహన్ రెడ్డి సీఎం గా  అధికారం చేపట్టిన అనంతరం,  సంక్షేమ పథకాలు ప్రతి గడపకు వెల్లువలా చేరుతున్నాయన్నారు.

గతంలో పింఛన్లు పొందేందుకు గ్రామ నాయకుల చుట్టూ, మండల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండేవన్నారు.నేడు గ్రామ స్థాయిలో సచివాలయాలు ద్వారా రైతు భరోసా,చేయూత,ఆసరా, అమ్మ ఒడి,విద్యా దీవెన ఇలా ప్రతి ప్రభుత్వ పధకం తోపాటు నేరుగా పలు  సేవలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ప్రతి పథకానికి అర్హులైన వారిని గుర్తించే  విధంగా గ్రామ వాలంటీర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారన్నారు.పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందన్నారు..పేదలకు, వృద్ధులకు,వితంతువులకు, వికలాంగులకు, మానసిక వైకల్యం కలిగిన వారిని ప్రతి గ్రామంలోనూ  గుర్తిస్తున్నారన్నారు.వీరికి ప్రతి నెల 1వ తేదీ నాటికి సామాజిక పింఛన్లకు కింద నగదు జమచేయడం జరుగుతుందన్నారు. పలాస నియోజకవర్గం ఉద్దాన ప్రాంతంలో ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని‌   ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏడు వందల కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచినీరు అందించే ప్రాజెక్టు నిర్మించామని త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం చేసి ఉద్దాన ప్రజల దాహార్తిని తీర్చుతామని‌ అన్నారు.

మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అందుకే ప్రతి పేద వాడికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు రెండు వందల పడకల కిడ్నీ ఆసుపత్రి నిర్మాణం చేసుకున్మని ఇదందా మన ప్రాంత ప్రజల కోసం అని తెలిపారు. పాత బడిన రోడ్లను వెడల్పు చేసి రహదారులు ఆధునీకరణ చేస్తున్నామని ప్రతి పని శాశ్వత ప్రాతిపదికన చేస్తూ ప్రజా అభివృద్ధికి,సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం ముందుకు పొతుందని తెలిపారు.ప్రజల సొమ్ముకు భద్రత కల్పిస్తూ ఎక్కడా ఎటువంటి లంచాలు లేకుండా పారదర్శక పాలన అందిస్తూ మీకు సేవలు అందిస్తుందని అన్మారు.ప్రతిపక్ష నాయకుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని వాటిని నమ్మవద్దని తెలిపారు. ప్రజా ధనాన్ని లూటీ చేసి తన సొంత సామాజిక వర్గానికి బాగు చేసిన చంద్రబాబు గుట్టు ఇప్పుడు రట్టు అయ్యిందని.గతంలో అధికారంతో వ్యవస్థలను సర్ధుబాటు చేసిన వ్యక్తి నేడు పాపం పండి బాబు వేషాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయని ప్రజలు ప్రతి ఒక్కటి గమనించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో  జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ పాలిన శ్రావణి, స్ధానిక సర్పంచ్ పాలిన రమ్యా చిరంజీవి ,పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు,వజ్రపుకొత్తూరు ఎంపిపి ఉప్పరపల్లి నీలవేణి ఉదయ్ కుమార్,మండల పార్టీ అధ్యక్షుడు గురయ్యనాయుడు,వైసిపి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పాలిన శ్రీనివాసరావు,జెసిఎస్ కన్వినర్ వడ్డి కరుణాకర్,మందస ఎంపీపీ డొక్కరి దానయ్య, మాజీ పలాస చైర్మన్ కోత పూర్ణచంద్రరావు,యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ అందాల శేషగిరిరావు,పాలిన ఉమా మహేశ్వరరావు తోపాటు పలువురు వైసిపి నాయకులు,మహిళలు, సచివాలయ సిబ్బంది,మండల స్థాయి అధికారులు, వాలెంటీర్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top