తండ్రి నిష్టదరిద్రుడు.. కొడుకు పరిమదరిద్రుడు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి  

చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా.. రైతాంగం కరువుతో అల్లాడిపోవాల్సిందే
  
తండ్రీకొడుకులిద్దరూ ప్రజలను దోచుకున్న నికృష్టులు.

  తండ్రి నిష్టదరిద్రుడు.. కొడుకు పరిమదరిద్రుడు. 

 వ్యవసాయ శాఖ మంత్రి  కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్‌

 లోకేశ్ మెదడు మోకాలిలో ఉంది..
 
మిడిమిడి జ్ఞానంతో వ్యవసాయం గురించి లోకేశ్‌ మాటలు

 మా హయాంలో రాష్ట్రంలో సగటున ఏడాదికి 14 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగింది

  చంద్రబాబు హయాంలోలా ఇప్పుడు క్రాప్‌ హాలిడేలు లేవు

  నేడు ప్రతి సంవత్సరం పంటలు సమృద్ధిగా పండుతున్నాయి 

 సూటిగా ప్రశ్నించిన మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి

 నెల్లూరు:  తండ్రి చంద్ర‌బాబు నిష్టదరిద్రుడు.. కొడుకు లోకేష్‌ పరిమదరిద్రుడని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి విమ‌ర్శించారు. కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబే.. ఆయ‌న‌ ఎప్పుడు అధికారంలో ఉన్నా.. రైతాంగం కరువుతో అల్లాడిపోవాల్సిందే అన్నారు. శుక్ర‌వారం మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

 మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఏం మాట్లాడారంటే..:

కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు
- ఏ రోజు అయినా చంద్రబాబు వ్యవసాయం గురించి మాట్లాడారా? చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. వర్షం, నీరు అవిరి అయిపోతుంది. ఎక్కడా పచ్చదనం కనిపించదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే కరువుతో అల్లాడిపోవాల్సింది. రైతులు పనులు లేక వలసలు వెళ్లిపోయే పరిస్థితి. ఎప్పుడూ కూడా రైతులు రాష్ట్రంలో ఉండే పరిస్థితి కాదు. రాష్ట్రంలో ఒకడు నిష్టదరిద్రుడు. కొడుకు పరిమదరిద్రుడు. లోకేశ్‌ ఒక బచ్చా. లోకేశ్‌ కూడా వ్యవసాయం గురించి మాట్లాడతాడు. 

వ్యవసాయం తెలియకుండా వ్యక్తిగత దూషణలా?
- వ్యవసాయం, పంటలు, వ్యవసాయ విధానాల గురించి మాట్లాడటం చేతగాక వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. నువ్వు, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్లి ఎందుకు చదివావు. ఇక్కడ సరైన వసతులు లేకనా? ఎవరైనా వలస వెళ్తే.. కూలి పని చేసే కుటుంబం వేరే ప్రాంతానికి వ్యాపారానికో, ఇంకా అభివృద్ధి చెందడానికో ఆ ప్రాంతం నుంచి వలస వెళ్తారు. అది అర్థం చేసుకోలేక చంద్రబాబు హయాంలో నీరు లేక పంటలు లేక రైతులు బజారున పడ్డారు. అటువంటి పరిస్థితి నుంచి నేడు ప్రతి సంవత్సరం పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. చంద్రబాబు హయాంలో లా, ఇప్పుడు క్రాప్‌ హాలిడేలు లేవు. ఇప్పుడు రాష్ట్రంలో సగటున సంవత్సరానికి 14 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

లోకేశ్‌ మెదడు ఎక్కడుంది?
- లోకేశ్‌ నీకు మెదడు మోకాలిలో ఉందా? అరికాలిలో ఉందా? మాట్లాడటానికి నోరు తిరగదు. పది పంటలు చూపిస్తే.. అందులో ఐదు పంటల పేర్లు చెప్పగలవా? నీ సార్థక నామధేయం కంది పంట పేరు చెప్పగలవా? పప్పూగాడు అని నీ పేరు కదా. ఆ పప్పు పంటలను గుర్తు పట్టగలవా లోకేశ్‌. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రికి అధికార పిచ్చి. తండ్రీకొడుకులకు తినటానికి, పంచుకోవటానికి, దోపిడీకీ అవకాశం లేకపోవటంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.  ఏం పనిలేక.. అబ్బాకొడుకులు ఉన్మాదంతో తిరుగుతున్నారు. అన్ని వర్గాలు సంతోషంతో ఉండటంతో నిద్రపట్టడం లేదు. 

రైతులపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు
- ఏదైనా మాట్లాడేటప్పుడు నీతిగా నిజాయితీగా మాట్లాడటం నేర్చుకుంటే మంచిది. నీకు, ఈప్రభుత్వానికి నక్కకు - నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది. లోకేశ్‌ నోరు తెరిస్తే గబ్బు నోరు. విద్యుత్‌ ఛార్జీల పై ప్రశ్నించిన రైతులపై కాల్పులు జరిపించిన నీచుడు చంద్రబాబు. రైతులకు వ్యతిరేకంగా ఎన్నో విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నది చంద్రబాబు. ఈ జన్మ కాదు కదా.. వచ్చే జన్మలోనూ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి దరిద్రం ఉండకూడదు. రాష్ట్రం చేసుకున్న పాపం ఏమైనా ఉందంటే.. చంద్రబాబు లాంటి దరిద్రుడుకి లోకేశ్‌ లాంటి దరిద్రుడుకు జన్మ ఇవ్వటం ఒక్కటే. ఆ రెండు పొరపాట్లే రాష్ట్రానికి జరిగిన అరిష్టం. 

రెండెకరాల నుంచి రాష్ట్రాన్ని దోచుకున్నంత వరకు..:
- రాష్ట్రాన్ని దోచుకుతిని అన్ని విధాలా నాశనం చేసిన చంద్రబాబు, లోకేశ్‌లు విమర్శలు చేయటం హాస్యాస్పదం. అలాంటి తండ్రీకొడుకులు సీఎం గారి మీద, నా మీద సీబీఐ విచారణ మీద ఆరోపణలు చేయటం సరికాదు. సీబీఐ విచారణ తర్వాత వ్యక్తిగతంగా తప్పకుండా స్పందిస్తాను. నా మీద ఏ విధంగా సీబీఐ విచారణ జరుగుతోంది. మీ నాన్నలా..  సీబీఐ విచారణకు సహకరించకుండా కోర్టులకు వెళ్లి స్టేలు ఎలా తెచ్చుకున్నాడో చర్చిద్దాం. ప్రజల డబ్బులు దోచుకున్న నికృష్టపు వెధవలు మీరిద్దరూ. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంపాదనతో బ్రతుకుతున్నారు. రెండు ఎకరాలు ఉన్నవాడు... ఈరోజు విలాసవంతమైన బంగ్లాలు, దర్జాలు అనుభవిస్తున్నాడంటే ప్రజల్ని  దోచుకుని తిన్నవారు కాదా? మీరా మాట్లాడేది. మీకు మా గురించి మాట్లాడే నైతికత ఎక్కడుంది. 

రైతాంగ శ్రేయస్సే లక్ష్యంగా:
- చంద్రబాబు, వాడెవడో బుడ్డోడు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుతినటానికి కలవరిస్తున్నారు. ఈ ప్రభుత్వం రైతాంగ శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. వ్యవసాయాన్ని ప్రధానమైన జీవ నాడిగా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయ అభివృద్ధి కోసం చర్యలు తీసకుంటున్నాం. గతంలో ప్రతి నియోజకవర్గంలో అగ్రికల్చర్ మార్కెట్‌ కమిటీలు వేయలేదు. అవి ఈ ప్రభుత్వంలోనే ఏర్పాటు చేయటం జరిగిందని కాకాణి గోవర్థనరెడ్డి స్పష్టం చేశారు.

Back to Top