తాడేపల్లి: గురునానక్ జయంతి సందర్భంగా ఈనెల 30వ తేదీన నిర్వహించే గురుపూరబ్ ఉత్సవాలకు హాజరుకావాలని విజయవాడ శ్రీగురుసింగ్ సహ ధర్మ్ ప్రచార్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను విజయవాడ శ్రీగురుసింగ్ సహ ధర్మ ప్రచార్ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ గురునానక్ కాలనీలోని గురుద్వార్‌లో జరుగనున్న ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానపత్రిక అందజేశారు. సీఎం వైయస్ జగన్‌ను కలిసిన వారిలో వైయస్‌ఆర్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, స్త్రీ సత్ సంగమ్ (మహిళా విభాగం) అధ్యక్షురాలు కులదీప్ కౌర్ మాతాజీ, సిఖ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎస్ హర్మహిందర్ సింగ్, శ్రీ గురుసింగ్ సభ అధ్యక్షులు ఎస్ కన్వల్ జిత్ సింగ్, పింకి హర్విందర్ సింగ్ ఉన్నారు.