సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స్ఫూర్తితో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్న ధ‌ర్మాన రామ్ మ‌నోహ‌ర్ నాయుడు

రామ్ మ‌నోహ‌ర్ నాయుడి ప‌ల్లె నిద్ర కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న‌

శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్ఫూర్తితో మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కుమారుడు, వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయకుడు ధ‌ర్మాన రామ్ మ‌నోహ‌ర్ నాయుడు ప్ర‌జ‌ల‌తో మమేక‌మ‌వుతున్నారు. గ‌త కొంత కాలంగా రామ్ మ‌నోహ‌ర్ నాయుడు త‌ల‌పెట్టిన ప‌ల్లె నిద్ర కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌జ‌ల‌తో గ‌డుపుతూ..వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తున్నారు. శ్రీ‌కాకుళంలోని  27వ వార్డు కొత్త పేట గ్రామంలో రామ్ వార్డు నిద్ర కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..అవినీతికి తావులేని ప్ర‌భుత్వం ఇది అని, ప్ర‌జా ప్ర‌భుత్వం ఇది అని చెప్పారు. నవ రత్నాల పేరిట అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల కోసం వివరిస్తూ ముందుకు సాగారు. ఇంటింటికీ తిరిగి, గ్రామ పరిస్థితులను తెలుసుకొన్నారు. గ్రామంలో రామ మందిరం లో  బస చేసిన  ఆయ‌న్ను స్థానికులు, ప‌లువురు పార్టీ నాయ‌కులు క‌లుసుకున్నారు.  

Back to Top