తాడేపల్లి: దేశవ్యాప్తంగా సీఎం వైయస్ జగన్ ట్రెండ్ సెట్ చేశారని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీల కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని తెలిపారు. తాడేపల్లిలో నిర్వహిస్తున్న వైయస్‌ఆర్‌సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దళిత జాతిని అవమానపర్చిన చరిత్ర చంద్రబాబుది: మంత్రి మేరుగ దళిత జాతిని అవమానపర్చిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి మేరుగ నాగార్జు ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని మంత్రి విమర్శించారు. రియల్టర్ల ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యమని మండిపడ్డారు. బీసీ బిల్లు పెట్టించిన ఘనత సీఎం వైయస్ జగన్‌దే: ఎంపీ ఆర్.కృష్ణయ్య బీసీ బిల్లు పెట్టించిన ఘనత సీఎం వైయస్ జగన్‌దేనని ఎంపీ ఆర్.కృష్ణయ్య యాదవ్ తెలిపారు. 56 కార్పొరేషన్లతో బీసీలకు గుర్తింపు వచ్చేలా చేశారని చెప్పారు.