శ్రీకాకుళం: చంద్రబాబు జైల్లో ఉన్నా..ప్రజల్లో ఉన్నా ఒక్కటేనని ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడారు.. చంద్రబాబును చంపితే మాకు ఏం వస్తుంది? తమ్మినేని ప్రశ్నించారు.. ఆయన ఎక్కడ ఉన్న ఒక్కటే.. జైలులో సదుపాయాలపై కోర్టు ద్వారా వారు ఏమి కోరుతున్నారో అవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. దేశంలోని నేరగాళ్లకి ఎలాగో చంద్రబాబుకి అలాగే అన్నారు. అతను ఆర్థిక నేరగాడు , మహాత్మా గాంధీనా, నెహ్రూ నా..? అంటూ ఎద్దేవా చేశారు.. అంతే కాదు.. టీడీపీ పని క్లోజ్.. పని అయిపోయిందని వ్యాఖ్యానించారు.. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ వాళ్లు ఇన్ని చేస్తున్నా సామాన్య ప్రజలలో ఎలాంటి రెస్పాన్స్ లేదన్నారు. ఆర్థిక నేరగాళ్లకు ప్రజలు సపోర్ట్ చేయరని స్పష్టం చేశారు. 16 నెలలు వైయస్ జగన్ ని జైలులో పెట్టారు.. కానీ, కేసులో ఏం నిరూపించుకాలేకపోయారని తెలిపారు. మా పార్టీ రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేస్తుంది.. మరి.. టీడీపీ, జనసేన, బీజేపీలు దమ్మున్న పార్టీలయితే అన్ని స్థానాల్లో ఆయా పార్టీలు పోటీ చేయాలని సవాల్ చేశారు. ఎంత మంది కలసి వచ్చినా ఓకే.. సీఎం వైయస్ జగన్ సింహం.. సింహం సింగిల్ గానే వస్తుందన్నారు.. పవన్ కల్యాణ్‌కి అంత పవనం లేదు.. చమడాలన్ని ఊడిపోయాయి అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎద్దేవా చేశారు.