సీఎం చేపట్టే ప్రతి సంక్షేమం నిర్విఘ్నంగా కొనసాగాలి

స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌

అరసవెల్లి సూర్యనారాయణుడిని దర్శించుకున్న స్పీకర్, డిప్యూటీ సీఎం

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, సీఎం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని అరసవెల్లి సూర్యనారాయణుడిని కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, స్పీకర్‌ తమ్మినేని సీతారాం చెప్పారు. రథసప్తమి సందర్భంగా అరసవెల్లి సూర్యనారాయణుడిని స్పీకర్‌ తమ్మినేని, డిప్యూటీ సీఎం ధర్మాన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉండిపోతారన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేపట్టే ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకా మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. 
 

Back to Top