తాడేపల్లి: మరికాసేపట్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాంపై ఎమ్మెల్యేలకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. తాడేపల్లిలోని వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో జరగనున్న మీటింగ్‌కు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు హాజరుకానున్నారు. పార్టీ అభ్యర్థులతో ఎన్నికల ఫలితాలపై వైయస్ జగన్ సమీక్షించి, ధైర్యం చెప్పి భవిష్యత్ కార్యచరణ గురించి చర్చించే అవకాశం ఉంది. విమానం రద్దు.. కీలక నేతల మిస్సింగ్ బెంగళూరు-విజయవాడ అలయన్స్ ఎయిర్ విమానం రద్దు చేయడంతో వైయస్ఆర్‌సీపీ కీలక నేతలు సమావేశానికి హాజరుకాలేకపోతున్నారు. ఉదయం 7.50 గంటలకు బయలుదేరాల్సిన విమానం రద్దైనట్లు చివరి నిమిషంలో ప్రకటన చేశారు. ఈ విమానంలో మాజీ మంత్రి ఉషా శ్రీ చరణ్, రాప్తాడు ప్రకాష్ రెడ్డ్, హిందూపురం ఇంచార్జ్ దీపిక, బియ్యపు మధుసూదన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, మెట్టు గోవింద రెడ్డి, వెంకట్ గౌడ, విక్రమ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఎంపీలు మినహా.. వైయస్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశానికి ఎంపీలు మినహా ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులకు పిలుపు ఎన్నికల ఫలితాలపై ఇటీవలె లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు. పార్టీ తరఫున పార్లమెంటరీ నేతల్ని వైయస్ జగన్ ఎంపిక చేసిన విషయం విధితమే.