తాడేపల్లి: కూటమి ప్రభుత్వం.. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అరెస్ట్‌లకు పాల్పడుతోంది. సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్‌ను నాలుగు నెలల కూటమి పాలనలో మూడోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటూరి అరెస్టులో సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోలేదు. ఇంటూరి రవికిరణ్‌ను తాజాగా మరోసారి పోలీసులు అరెస్టు చేయడంతో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబులు బెయిల్‌పై విడుదల చేయించారు. అరెస్టుకు ఆస్కారం లేని ఆరోపణల్లో పోలీసులు అరెస్టులకు దిగారు. వేధించాలన్న ఉద్దేశంతోనే ఆగస్టు 31న గుడివాడ నుంచి విశాఖపట్నంకుఉ పోలీసులను చంద్రబాబు ప్రభుత్వం పంపించింది. పోలీసులు ఆరోపిస్తున్న పోస్టింగ్స్ కూడా ఎన్నికలకు ముందు పెట్టినవే. అలాగే అక్టోబర్ 21న మరోసారి ఇంటూరి రవికిరణ్‌ను అరెస్టు చేశారు. పది రోజుల వ్యవధిలోనే మరోసారి అరెస్టు చేయడాన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్రంలో వైయస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా కక్షపూరితంగా వ్యవహరిస్తోన్న చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలను కూడా వేధింపులకు గురిచేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వైయస్ఆర్ సీపీ మద్దతుదారులను టార్గెట్ చేస్తూ కేసులు పెడుతోంది. కూటమి సర్కార్ వైఫల్యాలు ఎత్తిచూపే రవికిరణ్‌ను అరెస్ట్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.