మైదుకూరు: వైయస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా సాగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. కేసీ కెనాల్ మీదుగా కార్ల ర్యాలీ జరిగింది. మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరు రోడ్‌లో అశేష జనవాహిని మధ్య, స్థానిక ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. సభలో ఎంపీ అవినాశ్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలు అంజాద్‌భాషా, నారాయణస్వామి, మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లతో పాటు వివిధ కార్పొరేషన్ల నాయకులు, జెడ్పీ ఛైర్మన్, జెడ్పీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. వక్తలు ఏమన్నారంటే...
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ...
–నేను ఎస్టీని, ఒక దళితుడిని. నిరక్షరాస్యుల బిడ్డను. పేదబిడ్డను. జగనన్న చలవతో డిప్యూటీ సీఎం అయ్యాను.
– స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లలో బడుగు బలహీనవర్గాలకు ఏం మేలు జరిగింది? జగనన్న నాలుగున్నరేళ్లలో ఎంత మంచి జరిగింది? అని ఆలోచిస్తే..ఆయనకు మనమెంతగా రుణపడిపోయామో తెలుస్తుంది.
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకుని, వారి స్థాయిని పెంచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
– చంద్రబాబు తన హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఎంత చులకనగా చూశారో, ఎన్ని అవమానాలు చేశారో చూశాం. ఆయన్ని నమ్మితే నిండా మునగడమే.
– బాబు బడుగు,బలహీన వర్గాలను ఓటుబ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారు.
– బడుగు, బలహీన వర్గాల సామాజికస్థాయి, ఆర్థిక ఉన్నతి పెంచిన అసలు సిసలైన ప్రజానాయకుడు జగనన్న.
ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా మాట్లాడుతూ...
– ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైంది. ఇన్నేళ్లపాటు సామాజిక సాధికారత అన్నది ఒక నినాదంగానే మిగిలిపోయింది.
–కానీ మన రాష్ట్రంలో జగనన్న పాలన వచ్చాక సామాజిక సాధికారత అన్నది ఒక విధానంగా మారింది.
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులంతా ఒకే వేదికపైకి ఎక్కడం, మాట్లాడటం మన మెప్పుడైనా చూశామా? ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యమంత్రి జగనన్న చలవ వల్లే ఇది సాధ్యమైంది.
– మైనారీల్టకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం చంద్రబాబుది.
– ఈరోజు జగనన్న వల్ల నలుగురు మైనార్టీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
నన్ను మంత్రిని చేశారు. ఉపముఖ్యమంత్రిని చేశారు.
– గత ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఏకంగా ఉపముఖ్యమంత్రిగా ఒక మైనార్టీ ఉన్నాడు.
– మైనార్టీ సామాజికవర్గానికి అనేక రకాలుగా ...ఎంతో మేలు చేసిన జగనన్నను మళ్లీ గెలిపించుకోవడం మన బాధ్యత, కర్తవ్యం.
– ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన బతుకులు బాగుంటాయి. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.
మంత్రి విడదల రజని మాట్లాడుతూ...
–జగనన్న కటౌట్ పెడితేనే ఇంత మంది తరలివచ్చారంటే...ఆయనపై మీకెంత అభిమానం ఉందో అర్థమవుతోంది.
– కడపలోని ప్రతి గడప గర్వపడేలా నాడు వైఎస్సార్, నేడు జగనన్న పాలన చేస్తున్నారు.
– 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు రాష్ట్రానికి జగనన్న. నాడు–నేడు పేరిట వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. 96శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తోంది.
– జగనన్న ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం. జగనన్న అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యాదీవెన, వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీ, ఉచిత పంటల బీమా, ఫించన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, షాదీతోఫా, జగనన్న తోడు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సంక్షేమ పథకాలు మనకోసం తీసుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.
–ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశలో నడిపిస్తూ..ముందుకు తీసుకెళుతున్నారు జగనన్న.
ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ...
– ఈ నాలుగున్నరేళ్లలో మనకు జరిగిన మేలు గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలి. గతంలో చంద్రబాబు ఐదేళ్లకాలంలో ఏం చేశారో ఆలోచించండి,
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించాడా? నాడు బాబు కేబినెట్‌లో ఎస్సీ మంత్రి లేడు, మైనార్టీ మంత్రి లేడు.
– వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు బలహీనవర్గాలకు 70 శాతం మంత్రి పదవులు ఇచ్చారు.
– ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో బడుగు,బలహీన వర్గాలకు సమున్నత గౌరవం దక్కింది.
– సంక్షేమ పథకాల ద్వారా జిల్లాలో రూ.12,061 కోట్ల లబ్ధి చేకూరింది.
– అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.7,984.48 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా అందాయి.