విశాఖ: అందరి అభ్యున్నతికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అణగారిన వర్గాలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకొంటే.. అన్ని వర్గాలను సొంత వారిలా భావించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం వైయస్ జగన్ అని చెప్పారు. అట్టడుగున ఉన్న వారికి క్రియాశీలక రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వైయస్ జగన్ అని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొట్టేగుల్ల భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం సామాజిక సాధికార బస్సుయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పీడిక రాజన్న దొర , బూడి ముత్యాల నాయుడు , ఎంపీ గొడ్డేటి మాధవి , జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర , ఎమ్మెల్యేలు , పార్టీ నాయకులు తదితరులు ప్రసంగించారు. చరిత్రలో నిలిచిన సీఎం వైయస్ జగన్: మంత్రి రాజన్నదొర సకల జనుల సంక్షేమమే అజెండాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అండగా నిలిచి, వారికి రాజ్యాధికారాన్ని ఇచ్చిన నేతగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహనరెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. సీఎం వైయస్ జగన్ పాలనలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని, బలహీన వర్గాలకు అధికారం ఇచ్చిన పార్టీగా వైయస్ఆర్‌సీపీ చరిత్ర తిరగరాసింది. రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లలో అంచెలంచెలుగా ఎదిగి, తండ్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న వ్యక్తి సీఎం వైయస్ జగన్ అని చెప్పారు. పైరవీలతో కాకుండా సీఎం వైయస్ జగన్ ఫైటర్‌గా రాజకీయాల్లో గెలిచారన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అంటూ బడుగు వర్గాలను అక్కున చేర్చుకున్న సీఎం వైయస్ జగన్ అని చెప్పారు.