సిట్‌ విచారణతో న్యాయం జరగదు

వైయస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ  జరపాలి

రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ లేదు..

వైయస్‌ఆర్‌సీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ)

విజయవాడ: వైయస్‌ వివేకానందరెడ్డి హత్యపై సిట్‌ విచారణతో ఎలాంటి న్యాయం జరగదని వైయస్‌ఆర్‌సీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) అన్నారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.సామాన్యుడికి నమ్మకం కలిగేలా విచారణ సాగాలని కోరారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఎలా ఉందో అర్థమవుతుందన్నారు.నేతల పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.వివేకానందరెడ్డి హత్యపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనన్నారు.ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాల్సిన సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమన్నారు.

  

Back to Top