గ్రీన్‌ ఎనర్జీలో దేశానికే ఆద‌ర్శంగా ఆంధ్రప్రదేశ్  

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షత ఎస్‌ఐపీబీ సమావేశం 
 
గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.81వేల కోట్ల పెట్టుబడులకు  గ్రీన్‌ సిగ్నల్‌

తాడేప‌ల్లి: గ్రీన్‌ ఎనర్జీలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, భారీ సంఖ్యలో ఉద్యోగాలు, రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.81వేల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. వీటితోపాటు మరిన్ని పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో ఎస్‌ఐపీబీ (స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌) సమావేశం జ‌రిగింది.  

ఎస్‌ఐపీబీ స‌మావేశంలో ముఖ్యాంశాలు..

– వైయస్సార్‌జిల్లా కొప్పర్తిలో పరిశ్రమను ఏర్పాటు చేయనున్న కాసిస్‌ ఇ–మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌.
– రూ. 386.23 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ. 
– ఇందులో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీకోసం రూ. 286.23 కోట్లు, ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలకోసం రూ.100 కోట్ల పెట్టుబడి. 
– తొలివిడతలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వేయి ఎలక్ట్రిక్‌ బస్సులు తయారుచేయాలని లక్ష్యం.
– 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు. 

– కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న  లైఫిజ్‌ ఫార్మా.
– మొత్తంగా రూ.1900 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ. 
– 2వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. 
– ఏప్రిల్‌ 2024నాటికి కంపెనీ ఏర్పాటు పూర్తిచేయాలని లక్ష్యం.
– ఏపీఐ డ్రగ్‌ తయారీలో చైనా దిగుమతులపై ఆధారపడకుండా.. స్వయం సమృద్ధి సాధించేదిశగా అడుగులు. 
– పరిశ్రమ కోసం ఇప్పటికే 236.37 ఎకరాలను సేకరించిన కంపెనీ. 

– మెటలార్జికల్‌గ్రేడ్‌ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్‌ మరియు రోల్డ్‌ గ్లాసెస్‌ తదితర వాటి తయారీకోసం పరిశ్రమతోపాటు సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.
– మూడు విడతల్లో మొత్తంగా రూ.43,143 కోట్ల పెట్టుబడి. 
– 11,500 మందికి ప్రత్యక్షంగా, 11 వేలమందికి పరోక్షంగా ఉద్యోగాలు. 
– నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ, దీంతోపాటు 50 గిగావాట్లు, 10 గిగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులను నెలకొల్పనున్న ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. 

– కృష్ణా జిల్లా మల్లవల్లిలో మెగా ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేయనున్న అవిశా ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.
– రూ. 150 కోట్ల పెట్టుబడి, 2500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. 
– 2023 మార్చకల్లా పూర్తిచేసే దిశగా కంపెనీ అడుగులు.
– దీనికోసం 11.64 ఎకరాల భూమి కేటాయింపు.

– ఆరు గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకూ ఎస్‌ఐపీబీ ఆమోదం. 
– ఈ ఆరు ప్రాజెక్టులకోసం రూ.81,043 కోట్ల పెట్టుబడి.
– 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన.

– వైయస్సార్‌ జిల్లా వొంగిమల్ల వద్ద 1800 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న అస్తా గ్రీన్‌ ఎనర్జీ వెంచర్స్‌  ప్రైవేట్ లిమిటెడ్‌. 
– దీనికోసం రూ.8,240 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 4వేలమందికి ఉద్యోగాలు. 
– 1,390 ఎకరాల్లో  ప్రాజెక్టు ఏర్పాటు. 
– డిసెంబర్‌ 2029 నాటికి ఏర్పాటు చేయాలని లక్ష్యం.

– సోమశిల, ఎర్రవరం వద్ద రెండు పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం. 
– సోమశిల వద్ద 900 మెగావాట్ల, ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి.
2100 మెగావాట్ల ప్రాజెక్టుకోసం రూ.8,855 కోట్లు ఖర్చు చేయనున్న షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌. 
– 1600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు. 
– జులై 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం.

– అవుకు, సింగనమల వద్ద రెండు పంప్డ్‌  హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ. 
– మొత్తంగా రూ. 6,315 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అరబిందో రియాల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌.
– 1600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు.
– అవుకు వద్ద 800 మెగావాట్లు, సింగనమల వద్ద 800 మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తి ప్రాజెక్టులు.
– డిసెంబర్‌ 2028 నాటికి ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిచేయాలని లక్ష్యం. 

– వైయస్సార్‌జిల్లా పైడిపాలెం వద్ద పంప్డ్‌ హైడ్రో, సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. 
– 7,200 మెగావాట్ల కరెంటు ఉత్పత్తికోసం రూ.33,033కోట్లు ఖర్చు చేయనున్న కంపెనీ. 
– పైడిపాలెం ఈస్ట్‌ 1200 మెగావాట్లు, నార్త్‌ 1000 మెగావాట్లు, 3500 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు, 1500 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు.
– 7,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి. 
– డిసెంబర్‌ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం. 
– ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ.

– కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌. 
– రూ. 5వేల కోట్ల పెట్టుబడి, ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ. 
– వేయి మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. 
– 700 మెగావాట్ల సోలార్, 300 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న కంపెనీ. 
– మార్చి 2025 నాటికి ప్రాజెక్టుల పూర్తిచేయాలని లక్ష్యం. 

– కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పంప్డ్, సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న గ్రీన్‌కో 
– 1680 మెగావాట్ల పంప్డ్‌స్టోరేజీ ప్రాజెక్టు, 2300 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్‌ ప్రాజెక్ట్‌లను ఏర్పాటుచేయనున్న గ్రీన్‌కో. 
– మొత్తంగా రూ.19,600 కోట్ల పెట్టుబడి. 
– 4,230 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. 
– సెప్టెంబర్‌ 2026 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం. 

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:
– గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి:
– ప్రాజెక్టుల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది:
– ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది:
– క్లీన్‌ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తాం:
– రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూముల్లో ఏడాదికి ఎకరాకు రూ.30వేల వరకూ లీజు కింద డబ్బు వస్తుంది:
– దీనివల్ల వారికి ఆదాయాలు కూడా పెరుగుతాయి:
– పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర వాటికోసం పెద్ద ఎత్తున సంస్థలు ప్రవేశిస్తాయి:
– వాటిద్వారా నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది:

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ) బూడి ముత్యాలనాయుడు, విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలికవసతులశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కార్మిక, ఉపాధి, శిక్షణశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, సీఎస్‌ సమీర్‌ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top