పార్వ‌తీపురంలో టీడీపీకి షాక్‌!

టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా: అధికార తెలుగు దేశం పార్టీకి పార్వ‌తీపురంనియోజ‌క‌వ‌ర్గంలో భారీ షాక్ త‌గిలింది. ప్ర‌భుత్వం  అనుస‌రిస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను నిర‌సిస్తూ టీడీపీకి చెందిన ప‌లువురు నాయ‌కులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సోమ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  పువ్వుల రాము, పువ్వుల అప్పారావు త‌మ అనుచ‌రులు, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వైయ‌స్ఆర్‌సీపీ గూటికి చేర‌డంతో వారికి జోగారావు కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..వైయ‌స్ జ‌గ‌న్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలకు జగనన్న 2.O ప్రభుత్వంలో మంచి గుర్తింపు ఉంటుంది అని తెలిపారు.  కార్యక్రమంలో  పార్టీ  జిల్లా  ఉపాధ్యక్షుడు బలగ శ్రీరాములు నాయుడు, జడ్పీటీసీ మామిడి బాబ్జీ, సర్పంచ్ బుడితి శ్రీనివాసరావు, నాయకులు చప్ప ఉమా మహేశ్వరరావు, తియ్యల శ్రీను, కోట్నాన ధనుంజయ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top