మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి షాక్‌

 వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన టీడీపీ కీల‌క నేత‌లు 
 

ప‌ల్నాడు:  జిల్లాలోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష టీడీపీకి షాక్ త‌గిలింది.  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆక‌ర్శితులై టీడీపీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి నేతృత్వంలో ప‌లువురు నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.  మాచర్ల మండలం నాగులవరం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీ వీడి, వై.యస్.ఆర్.సి.పి పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చిన మాట‌ను మూడేళ్ల‌లోనే నెర‌వేర్చార‌ని, ఇప్ప‌టికే 95 శాతం హామీలు అమ‌లు చేశార‌న్నారు. క‌రోనా వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తూ..న‌వ‌ర‌త్నాల ద్వారా ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తున్నార‌ని చెప్పారు. మ‌రో 30 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొన‌సాగుతార‌ని ధీమా వ్య‌క్తం చేశారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు అంద‌రూ అండ‌గా నిల‌వాల‌ని కోరారు. పార్టీలో అంద‌రికీ స‌ముచిత స్థానం ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top