రాష్ట్ర మంత్రిగా పెద్దిరెడ్డి ఎక్కడైనా పర్యటించవచ్చు

పెద్దిరెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేయాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలు చెల్లవు

ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉత్వర్వులను కొట్టివేసిన హైకోర్టు

అమరావతి :  రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి ఎక్కడైనా పర్యటించవచ్చ‌ని హైకోర్టు పేర్కొంది.మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డిని నిర్బంధిస్తూ శనివారం ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్  జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. పెద్దిరెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేయాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలు చెల్లవని తీర్పును వెలువరించింది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెద్దిరెడ్డి దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై ఆదివారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డికి ఉందన్న పిటిషనర్‌ తరపు న్యాయవాదుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రాష్ట్ర మంత్రిగా ఆయన ఎక్కడైనా పర్యటించవచ్చని తీర్పులో స్పష్టం చేసింది. మంత్రిపై ఇంట్లోనే ఉండాంటూ ఆయన విధించిన ఆంక్షలను చెల్లవని పేర్కొంటూ ఎస్‌ఈసీ జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top