నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వదించిన వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు

విజ‌య‌న‌గ‌రం:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెలిమ‌ర్ల ఎమ్మెల్యే అప్ప‌ల‌నాయుడు కుమారుడు ప్ర‌దీప్‌, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్  మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) కుమార్తె వివాహం గురువారం విజ‌య‌న‌గ‌రంలోని ర‌ఘు కాలేజీలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి, ఉత్త‌రాంధ్ర‌ జిల్లాల పార్టీ రిజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీసుబ్బారెడ్డి, ఎంపీ  బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) త‌దిత‌రులు హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రులను ఆశీర్వ‌దించారు.  
 

Back to Top