తాడేపల్లి: నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలును వివరించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. నేడు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం, అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర జరగనుంది. బడుగు, బలహీన, వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు సీఎం వైయస్ జగన్ చేసిన మేలును యాత్రలో ఆ వర్గాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు వివరించనున్నారు. చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. రోలుగుంట నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు కొత్తకోట ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 3 గంటలకు వడ్డాదిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. బస్సు యాత్రలో డిప్యూటీ సీఎంలు, రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, గుడివాడ అమర్‌నాథ్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొంటారు. రాజంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3.45 గంటలకు పాతబస్టాండ్ సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బస్సు యాత్రలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీలు మిథున్‌రెడ్డి, నందిగం సురేష్, జెడ్పీ చైర్మన్ అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక పాల్గొంటారు.