విజయవాడ:ప్రజల పక్షాన పోరాటానికి వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మహానేత వైయస్ఆర్75వ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైయస్ఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్ ఆశయ సాధన కోసం వైయస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం ఐదేళ్లలోనే ఈ రాష్ట్రంలో ఇరవై, ముప్పై సంవత్సరాల్లో జరగాల్సిన అభివృద్ధి, సంక్షేమాన్ని పేద కుటుంబం కేంద్ర బిందువుగా, పేదరికాన్ని నిర్మూలించే దిశగా వారి కాళ్లమీద వాళ్లు నిలబడే విధంగా ఆచరిస్తూ ఫలితాలు కూడా తీసుకొచ్చారన్నారు. ఈ అభివృద్ధి ఐదేళ్లలో మనం చూశామని.. మన కళ్లముందే జరిగిందన్నారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ప్రజలముందుకు వెళ్లాం. ఇంత చేశాం… మీ ఇంట్లో మంచి జరిగితే మీరు ఓటు వేయండని అడిగాం. అయితే ఫలితాలు వేరే విధంగా వచ్చాయన్న సజ్జల…. రాజకీయాల్లో ఇవి సహజమని అభిప్రాయపడ్డారు. అయితే ప్రజల పక్షాన నిలబడిన పార్టీగా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారి పక్కన అండగా నిలబడే పార్టీగా మన ప్రయాణం అనంతమైనదన్నారు. అందుకే జరిగిన ఎన్నికల ఫలితాలు మీద అనుమాలున్నా… దాన్ని ప్రజల తీర్పుగానే భావించాలన్న అంబటి.. అధికారంలోకి వచ్చిన వాళ్లు నెలతిరక్కముందే ఏ హామీలైతే అసాధ్యమో.. వాటిని ఇప్పట్లో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఘెరంగా ఉందన్న వాళ్లే ..తెలిసీ ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలిచ్చారన్నదానికీ సమాధానం కూడా వాళ్లే చెప్పాలన్న సజ్జల… అసాధ్యమైన హామీలిచ్చి 2014లో ప్రజలను ఎలా మోసం చేశారో.. మరలా అదే విధంగా మోసానికి మరోసారి శ్రీకారం చుట్టారని.. చంద్రబాబు మాటలు వింటే అర్ధం అవుతుందని తేల్చిచెప్పారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఖజానా ఇంత ఖాళీ అన్నీ ఇప్పుడే కావాలని అందరూ ఆశపడుతున్నారని… అది కష్టమయ్యేటట్టు ఉందని చెబుతున్నారు. ఆరు నెలల ముందు కూడా ఈ సంగతి ఆయనకు తెలుసు. లక్షల కోట్ల హామీలను ఏ రకంగా ఇచ్చారు. ఇదే హామీలను వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చి ఉంటే బాగుండేదని చాలా మంది చెప్పారు. కానీ అలా ఇచ్చి మోసం చేయడం, ఒకసారి మోసం చేసేక మళ్లీ మోసానికి శ్రీకారం చుట్టడం చంద్రబాబుకే చెల్లింది. ఇప్పుడు వచ్చి అదే చెబుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్న సజ్జల రామకృష్ణారెడ్డి… ఆ రోజు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో తన, పర చూడకుండా, కులం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమపథకాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలు తర్వాత రాజకీయాలు ఉండకూడని వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అనుకుంటే.. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకం ఎలా సృష్టిస్తున్నారో, ఒక రావణ కాష్టం ఎలా చేస్తున్నారో… పనికట్టుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన, ఓటు వేసిన వారిని కూడా వదలకుండా ఏ విధంగా దాడులు చేస్తున్నారో, వ్యవస్ధ మొత్తం ఎలా నీరుగారిపోయిందో గమనిస్తున్నామన్నారు. మరోవైపు ఐదేళ్లలో రూపుదిద్దుకున్న ఆరోగ్య వైద్య, విద్యావస్ధల సేవలకు గండికొట్టడం ప్రారంభం అయిందని... ఇంటివద్దకే సేవలను తీసేసి రేషనలైజేషన్ మరలా మొదలైంది. ఎందుకు ఈ విషయాలంటే.. ఆ రోజు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రయాణం రెండు అడుగులు వేస్తే.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత ముందుకు తీసుకుపోతే… దాన్ని పదేళ్ల వెనక్కి తీసుకునిపోయే ప్రక్రియకు మళ్లీ చంద్రబాబు మొదలుపెట్టారని…దాన్ని నిలువరించాలి సజ్జల పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో మనవైపు నుంచి లోటుపాట్లేమైనా ఉంటే వాటిని కూడా సరిదిద్దుకుని... ఎక్కడెక్కడ సరిగ్గా వ్యవహరించలేదో, దృష్టిపెట్టాల్సిన చోట పెట్టలేదో ... వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోవాల్సిన సందర్బంలో దివంగత ముఖ్యమంత్రి 75వ జయంతి వచ్చిందన్నారు. ఆయన మనకు స్ఫూర్తి, మార్గదర్శి మాత్రమే కాదని.. ఏ రకంగా అడుగులు వేయాలో చెప్పగల గొప్ప మనిషని .. అవే లక్షణాలు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అలవడ్డాయన్నారు. మనమందరం కూడా అదే బాటలో కలిసికట్టుగా ఉంటూ ఆయనకు అండగా ఉండాల్సిన అవసరం ఉందిన్నారు. ఆ తర్వాత ప్రజలకు అండగా ఉండడంతో పాటు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి… పునర్వైభవం తీసుకొచ్చే దిశగా ముందుకు వెల్లాలన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి మీదనో, వైయస్ఆర్‌సీపీ కార్యకర్తల మీద దాడుల చేయడం ద్వారా.. తాను ఇచ్చిన హామీలనుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని, అది సాగనివ్వమని హెచ్చరించారు. లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుందామని... మరలా పాత పునర్వైభవం వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమయంలో అందరూ కలిసి దీక్ష, పట్టుదలతో అడుగులు ముందుకు వేయడంతో పాటు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడానికి వైయస్ రాజశేఖర్ రెడ్డిగారు జయంతి కంటే మంచి సందర్బం రాదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.