చంద్రబాబు గారూ.. కృష్ణానదికి వరద వస్తోంది

ఇకనైనా మీరు చట్టాన్ని గౌరవించి గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయండి

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేప‌ల్లి:  కృష్ణాన‌దికి వ‌ర‌ద వ‌స్తోంద‌ని..టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి చట్టాన్ని గౌరవించాలని, ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. కోర్టుల ద్వారా రక్షణ పొందినా, ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూసినా, పైనుంచి వచ్చిన వరద మీ ఇంటిని ముంచివేయక మానదుకదా?' అని ఆయన ప్రశ్నించారు.

ఇదే క‌దా మీ రికార్డు..
 'తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు గారు, ఆయన కుమారుడు, వారి అనుయాయులు ఇలా వీరంతా అధికారాన్ని అనుభవిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని బీసీలు మోయాలంటారు. దీనికి ఏదో బ్రహ్మాండం జరుగుతున్నట్టుగా ఎల్లో పత్రికలు కలరింగ్‌ ఇస్తాయి. పాతికేళ్లుగా వేస్తున్న రికార్డే ఇది' అని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top