ఎల్లోమీడియా అవాస్త‌వ క‌థ‌నాలు రాస్తోంది

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

వ‌క్రీక‌ర‌ణ‌ల‌తో న్యాయ‌స్థానాల‌ను ప్ర‌భావితం చేసే ప్ర‌య‌త్నాలు కాదా?

కోర్టు కేసుల‌పై ప‌త్రిక‌లు నిగ్ర‌హం పాటించాలి

రంగుల క‌ల‌ను న‌మ్ముకునే చంద్ర‌బాబు నిండా మునిగారు

ప్ర‌భుత్వం రాజ్యాంగ‌బ‌ద్ధంగా ఒక నిర్ణ‌యం తీసుకుంటే వ్య‌తిరేకిస్తున్నా

స‌మ‌న్యాయం కోస‌మే రాజ‌ధాని మార్పు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌పై అర్థంలేని విమ‌ర్శ‌లు

తాడేప‌ల్లి: ఎల్లోమీడియా అవాస్త‌వ క‌థ‌నాఉ రాస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మండిప‌డ్డారు. ప‌త్రిక‌ల‌నేవి వాస్త‌వాలు రాయాలి. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నాలు వ‌క్రీక‌ర‌ణ‌ల‌తో న్యాయ‌స్థానాల‌ను ప్ర‌భావితం చేసే ప్ర‌య‌త్నాలు కాదా అని ప్ర‌శ్నించారు. ఎల్లో మీడియా క‌థ‌నాల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. చంద్ర‌బాబు రంగుల క‌ల‌ను ఈనాడు ప‌త్రిక రాస్తే..దాన్ని న‌మ్ముకుని ఆయ‌న మునిగిపోయార‌న్నారు. అమ‌రావ‌తిలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌న్నారు. స‌మ‌న్యాయం కోస‌మే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వికేంద్రీక‌ర‌ణ‌కు నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్పారు. కొంద‌రు మ‌తాల‌ను అడ్డుపెట్టుకొని ప‌బ్బం గ‌డుపుకుంటున్నార‌ని ఫైర్ అయ్యారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

చంద్ర‌బాబు అత్యాశ‌కు పోయారు..

అమ‌రావ‌తి విష‌యంలో చంద్ర‌బాబు అత్యాశ‌కు పోయి చావు దెబ్బ‌తిన్నార‌ని స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి విమ‌ర్శించారు. ప‌త్రిక‌లు అడ్డ‌గోలుగా క‌థ‌నాలు రాయ‌డం చ‌ట్ట వ్య‌తిరేకమ‌ని, ప‌త్రిక‌లు కోర్టు కేసుల‌పై నిగ్ర‌హం పాటించాల‌ని సూచించారు. న్యాయ మూర్తుల‌ను ప్ర‌భావితం చేసేలా క‌థ‌నాలు రాయ‌డం స‌రైంది కాద‌న్నారు. ప్ర‌భుత్వం రాజ్యాంగ‌బ‌ద్ధంగా ఒక నిర్ణ‌యం తీసుకుంటే వ్య‌తిరేకిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాజ‌ధాని వ‌ష‌యంలో చంద్ర‌బాబు రంగుల క‌ల ఈనాడు పేప‌ర్‌లో రాశార‌ని త‌ప్పుప‌ట్టారు.ఆ రంగుల క‌ల‌ను న‌మ్ముకునే చంద్ర‌బాబు నిండా మునిగార‌ని గుర్తు చేశారు.  ప్ర‌జలంద‌రూ ఆశ‌లు పెట్టుకున్నారు. వారి ఆశ‌ల‌ను నీరుగారిస్తే..సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కు ప‌ట్టం క‌ట్టారు. ఒక రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారిలాగా పావ‌లాకు వెయ్యి రూపాయ‌లు లాభం రావాల‌నే అత్యాశ‌కు పోయి చావు దెబ్బ తిన్నారు. చంద్ర‌బాబు బినామీలు మాత్ర‌మం రాజ‌ధాని ప్రాంతంలో భూములు కొన్నార‌ని పేర్కొన్నారు. ఇది ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ కాదా అని ప్ర‌శ్నించారు.

స‌మ‌న్యాయం కోస‌మే రాజ‌ధాని మార్పు

స‌మ‌న్యాయం కోస‌మే రాజ‌ధాని మార్పు చేస్తున్నామ‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్ర‌బాబు అమరావ‌తి పేరుతో మోసం చేస్తే..మేం వికేంద్రీక‌ర‌ణ చేస్తున్నాం. వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్‌, క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని పెడుతున్నారు. అంతేకాని వైయ‌స్ జ‌గ‌న్ త‌న సొంత జిల్లాకు రాజ‌ధాని తీసుకెళ్ల‌లేదు. మీరు పెట్టిన చోటే శాస‌న రాజ‌ధాని పెడుతున్నాం. ఇంకా ఎడుపెందుకు?. న‌వ న‌గ‌రాలు ఒకే చోట అని మీరే చెప్పారు. మిగిలిన ప్రాంతాలు క‌నిపించ‌లేదా? ఉత్త‌రాంధ్ర‌ను ఏం చేయాల‌నుకున్నారు. అధికారం కేంద్రీకృతం చేయ‌డం స‌రికాద‌ని అంద‌రూ అంటుంటే..అన్నింటిని కూడా ఒకే చోట పెట్టాల‌ని ..దాంతో డ‌బ్బు సంపాదించాల‌ని, రైతుల‌ను ముంచి ల‌బ్ధి పొందాలని చంద్ర‌బాబు చూశారు. వేల కోట్ల అవినీతి చేసి, అంద‌రి త‌ల‌పై శ‌ట‌గోపం పెట్టారు. ఈ రోజు అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేయాల‌ని చూస్తుంటే..మీరు అడ్డుప‌డుతున్నారు. ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే చ‌రిత్ర‌హీనులుగానే మిగిలిపోతారు. ఇలాగే క‌థ‌నాలు రాస్తే..ఆ ప్రాంతాల వారు మిమ్మ‌ల్ని రానివ్వ‌రు. మా పార్టీ మీలాగా కుయుక్తులు చేసేది కాదు. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా..అదికారంలో ఉన్నా ప్ర‌జ ప్ర‌యోజ‌నాలే మాకు ముఖ్యం. అడ్డ‌దారులు తొక్కేవాళ్లం కాదు. 

ఏడ్చేవారంతా చంద్ర‌బాబు బినామీలే..

 అమ‌రావ‌తి ప్రాంతంలో వ్య‌వ‌సాయం చేస్తారు. అక్క‌డ రైతులు కాకుండా..మిగ‌తా వారు ఎందుకు భూములు కొన్నారు. గుంటూరు- విజ‌య‌వాడ మ‌ధ్య, నూజీవీడు వ‌ద్ద రాజ‌ధాని అంటూ లీకులు ఇచ్చారు. టీడీపీ నేత‌ల‌కు మాత్రం రాజ‌ధాని ఎక్క‌డ వ‌స్తోందో ముందే తెలిసి అక్క‌డ భూములు కొన్నారు. రైతుల‌కు ఎలాంటి న‌ష్టం రాలేదు. ఇప్పుడు ఏడ్చేవారంత చంద్ర‌బాబు బినామీలు, వ్యాపారులే. కోర్ క్యాపిట‌ల్‌, సింగ‌పూర్ పెట్టుబ‌డిదారులు అంతా కూడా చంద్ర‌బాబు బినామీలే. 
కోర్టులో కేసులు వేసి మీ స‌త్తా చూపించుకోండి కానీ ఇలా రోజు త‌ప్పుడు క‌థ‌నాలు రాసి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాల‌నుకోవ‌డం స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు.  

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిత్యం ఆ దేవుడి ఆశీస్సులు కోరుతారు..

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు భ‌క్తీభావం ఎక్కువ‌గా ఉన్నాయ‌ని..ఆయ‌న నోరు తెరిస్తే చాలు ఆ దేవుడి ఆశీస్సులు కోరుతుంటార‌ని రామ‌కృష్ణారెడ్డి తెలిపారు.ఆయ‌న  భ‌క్తి విశ్వాసాల‌కు సంబంధించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గ‌తంలో కూడా తిరుమ‌ల‌ను సంద‌ర్శించారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా తిరుమ‌ల వెళ్లారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు వెళ్లారు. సీఎం హోదాలో కూడా స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. టీటీడీ ఆహ్వానం మేర‌కు మ‌ళ్లీ ఈ నెల 23వ తేదీ వెళ్తున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌ఫున స్వామికి ప‌ట్టువ‌స్త్రాలు ఇస్తారు. ఇందులో వ‌చ్చిన ఇబ్బంది ఏమిటీ? ఎవ‌రో ప‌నీపాట లేని వారు కామెంట్ చేయ‌డం, వాళ్లే ఇష్యూ చేయ‌డం క‌నిపిస్తోంది. ఇందులో చిన్న‌పాటి వాస్త‌వం లేదు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎప్పుడు నోరు తెరిచినా..దేవుడి ఆశీస్సులు, ప్ర‌జ‌ల దీవెన‌లు కావాలంటారు.ఇంత‌కంటే భ‌క్తి ఇంకేం కావాలి. చంద్ర‌బాబు ఎక్క‌డా కూడా చొక్కా విప్పి, బూట్లు విప్పి పూజ‌లు చేసిన‌ట్లు చూడ‌లేదు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కూడా కొన్ని పార్టీలు కులాలను, మ‌తాల‌ను అడ్డుపెట్టుకొని త‌ప్పుడు విమ‌ర్శ‌లు చేశారే త‌ప్ప‌..ఒక్క‌టి కూడా నిజం కాదు. ఏ పార్టీ అయినా కూడా ప్ర‌జ‌ల‌కు ఉన్న అవ‌స‌రాలు ఏంటి?  వారి స‌మ‌స్య‌లు ఎలా ప‌రిష్క‌రించాలనే ఆలోచ‌న చేస్తాయి. కానీ కొన్ని పార్టీలు కేవ‌లం మ‌తాల‌ను అడ్డుపెట్టుకొని రాజ‌కీయాలు చేస్తున్నాయి. మ‌తాన్ని అడ్డుపెట్టుకొని ఇంకా ఎన్నాళ్లు ప‌బ్బం గ‌డుపుతార‌ని, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌పై విప‌క్షాలు అర్థంలేని విమ‌ర్శ‌లు చేస్తున్నాయ‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top