గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వంపై స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స‌మీక్ష‌

టెలీకాన్ఫ‌రెన్స్ ద్వారా పార్టీ నేత‌ల‌కు ప‌లు అంశాల‌పై దిశానిర్దేశం

తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ ముఖ్య నేతలతో స‌జ్జ‌ల‌ మాట్లాడారు. ఈ సందర్భంగా.. గృహసారథుల నియామకాలపై ప్రధానంగా చర్చించారు. గృహసారథుల నియామకం అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పూర్తికాక‌పోవ‌డంతో నియామ‌క సమయాన్ని పొడిగించారు. ఈనెలాఖరు వరకు గృహ సార‌థుల‌ను నియ‌మించాల‌ని పార్టీ ముఖ్య‌నేత‌ల‌కు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సూచించారు. అదేవిధంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గృహసారథులతో మండలాల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని టెలీకాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న నేత‌ల‌ను ఆదేశించారు. 

Back to Top