వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో గ‌ణ‌తంత్ర వేడుక‌లు

తాడేపల్లి: 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైయ‌స్సార్‌‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అందరం గుర్తుంచుకోవాలని తెలిపారు. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన మార్పు, రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా నిలిచిందని కొనియాడారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలో ఉన్నప్పటికీ, చట్టంలో వైయ‌స్‌ జగన్‌ తెచ్చిన మార్పు రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. దేశంలో కోరుకుంటున్న మార్పును తొలిసారి ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎవరు డబ్బు, మద్యం పంపిణీ చేసినా అతని ఎన్నిక రద్దు, రెండేళ్ల జైలు తప్పదని తెలిపారు. ఎన్నికలు నిర్వహించాల్సిన వారు నిష్పక్షపాతంగా నిర్వహించాలని సజ్జల అన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే.....
 రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున అంతా బాగుండేట్లు చూసుకునే బాధ్యత మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైనే ఎక్కువగా ఉంది. ఆ దిశగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్ గారు అమలు చేస్తూ వస్తున్న పథకాలు కానీ సమాజంలో సమూలంగా తెస్తున్న మౌళిక మార్పులు కానీ ఆ వంతు చేస్తున్న ప్రయత్నాలు, కృషి కానీ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంతటి ఆర్ధిక సంక్షోభంలో కూడా
ముఖ్యమంత్రి గారు కృషి ఎట్లాంటి సత్ఫలితాలను ఇస్తుందో అంతా చూశారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు దేశంలోనే అందరి
ప్రశంసలను అందుకుంది. ఇదంతా కూడా జగన్ గారి నేతృత్వంలో స్వయంగా ఆయన ప్రత్యక్ష పాత్ర పోషిస్తూ చేయడం వలనే సాధ్యమైందనే సంగతి కూడా అందరికి తెలుసు.

 ఈ కృషి ఇలానే కొనసాగుతుంది. వచ్చే ఐదేళ్ళలో రాజ్యాంగం ఏదైతే ఆకాంక్షించిందో.. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు సృషించే సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి జగన్ గారు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన అన్ని హక్కులు కాపాడడంతో పాటు ప్రజాస్వామ్యం పరిఢవిల్లేటట్లు చేయడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వంతుగా ఎప్పుడూ ముందుంటుందని మరోసారి హామీ ఇస్తున్నాను.

గడచిన పదేళ్ళలో మన రాష్ట్రం ఎన్ని రకాల ఆటుపోట్లకు గురైందో, ప్రియతమ నేత జగన్ గారు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కులను అలాగే న్యాయ వ్యవస్థను నమ్మి 
ఇంతకాలం పోరాడుతూ వచ్చారో...  మనమందరం గమనిస్తూనే ఉన్నాం. అయితే ప్రజల దీవెనలతో ఆయన అధికారంలోకి రాగానే వచ్చిన ప్రతి మార్పూ ఒక అభ్యుదయకరమైనదే. రాజ్యాంగ నిర్మాతలు ఆనాడు ఏదైతే ఆకాంక్షించారో... వాటిని పూర్తిగా అమలు చేసే దిశగా ఆయన ముందుకు సాగుతున్నారు.

రాజ్యాంగం గురించి చర్చించుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి రేపు జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో మళ్ళీ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే... మాకు మేము వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీగా ఉన్నప్పటికీ... జగన్ గారు ఖచ్ఛితమైన ప్రోగ్రెసివ్ మార్క్ వలన పంచాయతీ చట్టంలో మార్పు వచ్చింది. పంచాయతీ ఎన్నికలలో ధనం, మద్యం, బలప్రయోగం ఉండకూడదనే ఉద్దేశ్యంతో మా పరిధిలో ఉన్న పంచాయతీ చట్టానికి మార్పులు తీసుకొచ్చాం. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి అని గర్వంగా చెప్పుకోగలం. ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తనకున్న అవకాశాలను, వెసులుబాటును వదులుకోదు. అయినా కూడా దాని కోసం మా చేతికి మేము కట్లు వేసుకుని ఎన్నికల రంగంలో దిగడానికి సిద్ధమయ్యాం. ఇది కేవలం జగన్ గారి ఆలోచనా దృక్పదానికి అసలైన నిదర్శనం. చట్టంలో వచ్చిన ఈ మార్పు వలన రేపు జరగనున్న ఎన్నికలలో
ఎక్కడైనా, ఎప్పుడూ ఏ అభ్యర్థి అయినా డబ్బు పంచినా.. మద్యం తదితరాలతో ప్రలోభాలకు గురి చేసి ఎన్నికైనట్లు తేలితే ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత కూడా సదరు అభ్యర్ధిపై అనర్హత వేటు వేయడమే కాక రెండేళ్ళ జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం.

 అధికార పార్టీ అయి ఉండి కూడా ఇంత గట్టిగా మాకు మేమే షరతులు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగుతున్నాం. అలాగే దీన్ని నిర్వహించాల్సిన వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇన్నాళ్ళూ ఎలాగైనా నడిచి ఉండొచ్చు. ఖచ్చితంగా ఒక పక్షపాత ధోరణితో రాజ్యాంగపరంగా తనకు దక్కిన అధికారాలను హక్కులుగా అనుకుని, బాధ్యతగా కాకుండా ఆయన వినియోగించుకున్నారు. అదే విధంగా ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమయ్యాక ఆయన ఇబ్బందులు పెడితే ఎన్నయినా పెట్టొచ్చు.
కానీ ప్రభుత్వ ఇంటెన్షన్, ముఖ్యమంత్రి ఆశయం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు - ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ప్రభుత్వానికి సహకరించాలి. ఎన్నికలు సజావుగా జరిగేలా ఆయన బాధ్యత తీసుకోవాలి.

 నిజంగా నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలకు వైఎస్సార్ రౌంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుంది.ఎందుకంటే పుట్టుకతోనే ఎన్నికలతో పుట్టిన పార్టీ మాది. ఏ సమస్య వచ్చినా ప్రజల్లోకి పోయి రెఫరెండం అడుగుతున్న పార్టీ మాది. పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం అనే విషయంలో మా వైపు నుంచి ఎలాంటి మార్పు లేదు. ఎన్నికల కమిషనర్ వైపు నుంచి కూడా అదే ఆశిస్తున్నాం. మరోసారి రాజ్యాంగ వ్యవస్థలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎలా గౌరవిస్తుందో... ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అవసరమైతే తన పరిధిని మరింత తగ్గించుకునేందుకైనా సిద్ధం. సమాజానికి మరింత మెరుగులు దిద్దడానికి గత పదేళ్ళుగా జగన్ గారు కానీ పార్టీ కానీ జరుపుతున్న రాజకీయ పోరాటం ఇక ముందు కూడా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా కొనసాగుతుందని తెలియజేస్తూ మరోమారు ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Back to Top