తాడేపల్లి: చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ విషయం ప్రజలకు తెలుసు.. నోటుపై ఎలాంటి ముద్ర ఉన్నా ఏది ఉన్నా.. నోటు నకిలీది అని తెలిసిన తర్వాత ప్రజలు ఎవరూ అలాంటి నోటును కావాలనుకోరు. అలాగే, చంద్రబాబును కూడా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు. గురువారం వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారు. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు. చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారు. చంద్రబాబు సభలకు జనం రావడం లేదు. ప్యాంట్రీ కారుపై కూడా అసత్య ప్రచారం చేశారు. అన్ని అనుమతులు తీసుకున్నా ప్యాంటీ కారుపై తప్పుడు ప్రచారం చేశారు. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదు. బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకే టికెట్లు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు మోసపూరిత హామీలతో చంద్రబాబు వస్తున్నారు. ఏ పార్టీ వైపు ఉండాలో ప్రజలు నిర్ణయించారు. స్పష్టమైన అజెండాతో వైయస్ఆర్‌సీపీ ఉందని ప్రజలకు తెలుసు. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని ప్రజలకు తెలుసు. గతంలో చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు మర్చిపోలేదు అంటూ కామెంట్స్ చేశారు. బస్సు యాత్రకు విశేష స్పందన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్రకు ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తోంది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రజలు తిరస్కరించారు.. ఉమ్మడి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని చంద్ర బాబు దోచుకున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు సభలు విఫలం అవుతున్నాయి.. వైయస్ జగన్ బస్సు యాత్రలో ఉపయోగించే ప్యాంట్రికి ఈసీ అనుమతి తీసుకున్నాము అని ఆయన తెలిపారు. క్యాంపు ఆఫీసుకు ఎదో కంటేయినర్ అంటూ టీడీపీ అసత్య ప్రచారం చేసింది. శ్రీకాకుళంలో చట్టబద్ధంగా తీసుకున్న గోడౌన్ పై కూడా తెలుగు దేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది. టీడీపీది దివాలకోరుతనం అని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏమి చేస్తామో టీడీపీ చెప్పాలి కానీ.. తప్పుడు ప్రచారం చేయడమే నమ్ముకుంది ఆ పార్టీ అని విమర్శలు గుప్పించారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇస్తే సరిపోయేది అని సజ్జల అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్లో ఆ పార్టీ వాళ్ళు పెద్దగా కనిపించలేదు.. బీజేపీ పక్షాన టీడీపీ వాళ్ళను బరిలో పెట్టారు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది అని ఆయన చెప్పారు. చంద్రబాబు ఇంకా కొత్త హామీలు ఇస్తారు.. ఆ హామీలకు విలువ లేదు.. చంద్రబాబు అంటేనే నకిలీ.. ఏదీ చెప్పిన అమలు చేయడు.. చంద్రబాబు తప్పుడు దారిలో అధికారంలోకి వస్తే.. ఇప్పుడు వస్తున్న పెన్షన్లు కూడా ఆగిపోతాయి.. అలాగే, చంద్రబాబు హామీలు నకిలీ కరెన్సీతో సమానం అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.