ఎవరెన్ని కుట్రలు పన్నినా వైయస్ఆర్ సీపీ విజయం ఖాయం

రాష్ట్ర ప్ర‌జ‌లంతా మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌నే సీఎం కావాల‌ని కోరుకుంటున్నారు 

ప్రతి నియోజకవర్గంలో మెజారిటీ పెంచే దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలి

ప్రతి ఓటర్‌ను పోలింగ్ బూత్‌లో ఓటు వేయించేలా సమన్వయంతో పనిచేయాలి

దొంగఓట్ల తొలగింపు, అర్హులైన వారికి ఓటుహక్కు క‌ల్పించ‌డంపై దృష్టిపెట్టండి 

క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారికి పార్టీ అండగా ఉంటుంది.. తగిన గుర్తింపు లభిస్తుంది

ప్రభుత్వంపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి

టెలీకాన్ఫరెన్స్‌లో వైయ‌స్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేప‌ల్లి: వైయస్ జగన్ మ‌ళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని ప్రజలంతా కోరుకుంటున్నారని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం వైయస్ జగన్ పారదర్శకమైన  పరిపాలన పట్ల ప్రజల అభిమానం రోజురోజుకు పెరుగుతోందని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా వైయస్ఆర్ సీపీ విజయం ఖాయమైందని, అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ మెజారిటీ పెంచే దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులు, జేసీఎస్ కోర్డినేటర్లతో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సంద‌ర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల లిస్ట్ ఫైనలైజేషన్ జరుగుతుంది కాబట్టి పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులు, జేసీఎస్ కోఆర్డినేటర్లు సమన్వయం చేసుకుంటూ  ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకుని పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా అర్హులైన ఓటర్లను గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించే అంశంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఓటర్ల లిస్ట్ ఫైనలైజేషన్ లో భాగంగా ఇంటింటికి తిరిగే కార్యక్రమం కాబట్టి బూత్ లెవల్ ఏజంట్స్ ద్వారా తగిన కసరత్తు పూర్తిచేయాలని సూచించారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపు 60 లక్షలకు పైగా దొంగఓట్లను చేర్పించారనే ఆరోపణలు ఉన్నాయని,  వాటిని గుర్తించి తొలగించే విధంగా ప్రజాస్వామ్య పద్ధ‌తిలో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. 

రానున్న ఎన్నికలకు సంబంధించి ఇది కీలకమైన అంశం కాబట్టి పూర్తిగా మనస్సు పెట్టి పనిచేయాలని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాలు ఇచ్చారని వివరించారు. ఇదే అంశాన్ని వైయస్ జగన్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో పరిశీలకులు, శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలకు పలుమార్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇటీవల పార్టీ పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో ఏ విధంగా వ్యవహరించాలో చెప్పడం జరిగిందన్నారు. పరిశీలకులు వారికి కేటాయించిన నియోజకవర్గంలో బాధ్యతతో పనిచేయాలని అత్యధిక సమయం కేటాయించాలని కోరారు. శాసనసభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్లకు సమన్వయం చేసి ఆయా నియోజకవర్గాలలో అందరూ ఐకమత్యంతో పనిచేసేలా చూడాలని సూచించారు. రానున్న సమయం అంతా ఎన్నికలకు సంబంధించి కాబట్టి వారికి హెల్ప్ ఫుల్ గా ఉండేలా వ్యవహరించాలన్నారు.

గృహసారథులు, జగనన్న సచివాలయ కన్వీనర్లు కలసి నిర్వహించిన జగనన్నే మా భవిష్యత్తు, జగనన్న సురక్ష వంటి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రతి ఇంటికి వైయస్ జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా వారికి కావాల్సిన సేవలు ఇంటివద్దకే అందించేరీతిలో జగనన్నే మా భవిష్యత్తు, సురక్ష కార్యక్రమాలు (జనన,మరణాల సర్టిఫికెట్లు, రెవెన్యూ సిబ్బంది జారీ చేసే సర్టిఫికెట్ల వంటివి జారీ) ప్రజలకు మేలు చేశాయన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రజల అవసరాలు తీర్చడంలో ఇలాంటి కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని రుజువుచేసిందన్నారు. ఈ కార్యక్రమాల పట్ల పార్టీ శ్రేణులనుంచే కాకుండా ప్రజలనుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. దేశంలోనే ఇది వినూత్నమైన ప్రోగ్రామ్ అని చెప్పారు. ఇదే రీతిలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కూడా ఇంటింటికి వెళ్లి పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కార్యక్రమంపై కూడా ప్రత్యేక దృష్టితో పనిచేయాలన్నారు. ఇందులో సచివాలయ కన్వీనర్లు, మండల కన్వీనర్లు, గృహసారథులు అందరూ ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. ఎందుకంటే ప్రతి ఓటూ కీలకమైందని ఇది అందరూ గుర్తెరిగి మసలుకోవాలని వైయస్ జగన్ చెప్పారని వివరించారు.

గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, మండల కన్వీనర్లకు బీమా
గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, మండల కన్వీనర్లకు బీమా సౌక‌ర్యం కల్పించడం జరుగుతుంద‌ని, దానికి సంబంధించిన సమాచారం కోరడం జరిగిందన్నారు. మిగిలిన వారు త్వరగా వారికి సంబంధించిన సమాచారం పంపించాల‌ని సూచించారు. పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసేవారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి ఆరోగ్య భద్ర‌త దగ్గరనుంచి వారికి పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామన్నారు. కష్టపడి పనిచేసేవారికి సంబంధించి రానున్న కాలంలో పార్టీ వారికి తగిన విధంగా బాధ్యతలు అప్పగిస్తుందని, ఇది గుర్తెరిగి పనిచేయాలి సూచించారు. ఇందుకు సంబంధించి అడిగిన సమాచారం సకాలంలో అందించాలని కోరారు.

ప్రతి నియోజకవర్గంలో సమావేశం..
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు `వై ఏపి నీడ్స్ వైయస్ జగన్` అనే అంశంపై సమావేశాలు నిర్వహించాలని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్ని విధాలా సత్తాగల నాయకుడు వైయస్ జగన్ మాత్రమే అనేే విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లే విధంగా పార్టీ శ్రేణులను మోటివేట్ చేయాలని సూచించారు. సమావేశాలలో మండల, పట్టణ స్థాయి నేతలతోపాటు సచివాలయ కన్వీనర్లు, మండల కన్వీనర్లు, గృహసారథులు పరిశీలకులు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ముఖ్యంగా 9 నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో పార్టీ శ్రేణులంతా ప్రతిపక్షాల విమర్శలను ఎక్కడిక్కడ.. ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి వారి ఆరోపణలను నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. వైయస్ జగన్ నాలుగు సంవత్సరాల పాల‌నాకాలంలో ప్రజలకు అమలు చేసిన కార్యక్రమాలు, అందించిన పథ‌కాలను ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ముమ్మరంగా తీసుకువెళ్లాలని కోరారు. టెలీకాన్ఫరెన్స్ కు పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.

Back to Top