తాడేపల్లి: ఎల్లో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన చూసి ప్రతిపక్షాలు కడుపుమంటతో రగిలిపోతున్నాయి. ఎల్లో మీడియాతో దుష్ర్పచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాది ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఈరోజు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చి నేటికి నాలుగేళ్లు అయింది. ఇచ్చిన హామీలను 98.5% అమలు చేసి చూపించాం. అసలైన రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలు సీఎం వైయస్ జగన్ చేసి చూపించారు. అవినీతికి వ్యతిరేకంగా, పారదర్శకంగా అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్నాం. బందరు పోర్టు శంకుస్థాపన మరో మైలురాయి. వచ్చే ఏడాది రామాయపట్నం పోర్టు ప్రారంభం అవుతుంది. నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో ప్రజలంతా గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏపీ పాలనను మెచ్చుకుంటున్నాయి. ఆ మీడియా.. కరుడుగట్టిన పసుపు దండు బ్యాచ్ - ఎవరైతే కరుడుగట్టిన పసుపు దండు సభ్యులుగా ఉన్నారో.. వారు- ఏబీఎన్, ఈటీవీ, టీవీ5 లాంటివాళ్లు అక్కడకు వెళితే ఎవరికైనా కచ్చితంగా ఆవేశం వస్తుంది. - వారు టీడీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తున్నారు. - మీరేమో ఒక పక్క అవినాష్ నాటకాలు వేస్తున్నాడు అంటారు..ఆ సమయంలో మీరు కన్పిస్తే ఎవరికో ఆవేశం వస్తే దాన్ని మీడియా మీద దాడి.. అంటూ గగ్గోలు పెడుతున్నారు. - దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. నిజమైన మీడియాపై ఎక్కడ ఏది జరిగినా బాధ పడతారు. - మీరు బాధ్యతాయుతంగా ఉండి...ఎవరైనా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే దాన్ని ఖండించాల్సిందే. - అలాంటి అంశాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ గారు సహించరు. - జరిగిన సంఘటనను ఎవరూ సమర్ధించరు. వందమందో, వెయ్యి మందో ఉన్న చోట ఖచ్చితంగా ఎవరో సంబంధం లేని వారు ఆవేశంగా రావచ్చు. - ఆ ఆవేశం వచ్చేటట్లు మనం ఎందుకు ప్రవర్తించాలి....? - అవినాష్ తల్లిగారి ఆరోగ్యం బాగోలేకపోయినా మీరు నాటకాలు అంటూ బ్రేకింగ్ లు వేసి, ఆ లోగో పట్టుకుని మళ్లీ అక్కడకు వెళ్లినప్పుడు కార్యకర్తలు ఆవేశపడటం సహజం. - ఎవరో ఒకరిద్దరు రియాక్ట్ అవ్వొచ్చు. దాన్ని ఖండిస్తాం. కానీ ఇలాంటి రాతలను కూడా ఖండించండి అని అడుగుతున్నా. - మొన్న కూడా తల్లికి ఆరోగ్యం బాగోలేక వెళ్తున్నాడు అని మీరే బ్రేకింగ్స్ వేశారు. - మళ్లీ మీరే వెంటపడి వెళ్లారు..అలా వెళ్ళాల్సిన అవసరం ఏముంది..? - ఆయనేమన్నా అండర్ గ్రౌండ్ నుంచి అప్పుడే బయటకు వచ్చాడా..? - గుత్తి వరకూ వెళ్లి బెంగుళూరు వెళ్తాడా..? మరో వైపు వెళ్తాడా అంటూ ఊహాగానాలు వేస్తారు. - ఎదురుగా మళ్లీ అదే మీడియా కన్పిస్తుంది... అలాంటప్పుడు ఏంటీ తప్పుడు రాతలనే కోపం ఎవరికైనా వస్తుంది. రాష్ట్రపతి పాలన అని, కేంద్ర బలగాలు వస్తున్నాయని ఏమిటా రాతలు, కూతలు..?: - రాష్ట్ర పోలీసులు, సీబీఐకి సంబంధించి... వీళ్లేం కోరారు..వాళ్ళేం చెప్పారు అనేది ఆ రెండు శాఖల మధ్య విషయం. - బలగాలు వస్తున్నాయి అని రాశారు.. మరి ఎందుకు రాలేదు..? - కేంద్ర బలగాలు రావడం అనేది అంత సాధారణమా..? - సినిమాలకు థర్డ్ గ్రేడ్ రైటర్ కథలు రాసినట్లు వీళ్ళు ఊహాగానాలు చేస్తున్నారు. - అసలు రాష్ట్రపతి పాలన పెట్టడం ఏంటి..? కేంద్ర బలగాలు రావడం ఏమిటి..? - ఒక బాధ్యతాయుతమైన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అనేది కూడా వీళ్ళు కనీసంగా ఆలోచించడం లేదు. - అవినాష్ రెడ్డి తనకు ఉన్న రైట్ ప్రకారం, విచారణకు మరికొద్ది సమయం కోరారు...అతనికి ఉన్న హక్కుల ప్రకారం కోర్టులకు వెళ్లవచ్చు. - రామోజీ మార్గదర్శి కేసును ఆపడానికి తట్టని కోర్టు తలుపులు లేవు. ఆయన చేస్తే న్యాయం. అవినాష్ రెడ్డి కోర్టుకు వెళితే అన్యాయమా.. ? - మార్గదర్శి విషయంలో మహిళ ఉద్యోగులు ఉంటే.. సీఐడీ వాళ్లు వచ్చి కూర్చున్నారు అని అంటారు. - అర్ధరాత్రి అవినాష్ ఇంటి డోర్‌కు నోటీసు అంటిస్తే...ఆ సమయానికి అవినాష్ లేకపోయినా కూడా, ఆయన తప్పే అన్నట్టుగా మీరే రాస్తున్నారు. రామోజీకి ఒక న్యాయం..అవినాష్ కి మరో న్యాయమా..?: - చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా జీవో ఇచ్చాడు. - ఈనాడులో అప్పుడు కుక్కకు తోక కత్తిరించినట్లు పెద్ద కార్టూన్ కూడా వేశారు. - మళ్లీ ఇప్పుడు వారికి అదే సీబీఐ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. - రామోజీకి ఒక న్యాయం..అవినాష్ కి మరో న్యాయమా..?. రామోజీ న్యాయ పరంగా ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకోవచ్చు..కానీ అవినాష్ మాత్రం అలా చేయకూడదు అంటాడు. - అవినాష్ సమయం అడిగాడు..సీబీఐ సమయం ఇచ్చిందనుకో ప్రపంచం తలకిందులు అవుతుందా..? - రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు, టీవీ5 నాయుడు తప్ప ప్రపంచంలో మిగిలిన వారంతా వారి దృష్టిలో అవినీతి పరులే. - వీళ్లు ఏ హక్కునకూ ఆర్హులు కారు.. కోర్టులకు వెళ్లకూడదు..అసలు ప్రజలు ఎన్నుకోడానికే వీళ్లేదు అంటాడు. - అవినాష్ రెడ్డి తల్లిని కర్నూలులోనే ఎందుకు చేర్చారు అంటూ చర్చలు పెడుతున్నారు. - అసలు ఇప్పుడే ఆమెకు అనారోగ్యం ఎందుకు వచ్చిందని కూడా వాళ్లు అడుగుతారు. - బెంగుళూరు వెళితే పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్లారు..మన రాష్ట్రంలో వైద్యం లేదా అని కూడా రాస్తారు. - హైదరాబాద్ వెళ్తే కేసీఆర్ ఫ్రెండ్ కాబట్టి వెళ్లారు అంటారు. - వివేకా హత్య కేసులో కూడా వీళ్లే ట్రైల్ చేసి శిక్షలు కూడా వేసేస్తున్నారు. - వీళ్లు రాసే రాతల్లో, వీళ్ల కథనాలు, వీళ్ల డిబేట్లు అన్నిటి ఉద్దేశం ఒక్కటే.. ఎదుటి వారి వ్యక్తిత్వ హననం. - ప్రభుత్వ పాలన బాగుంది కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికి వ్యక్తిగత అంశాలపైకి తిప్పుతుంటారు. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే డ్రామాలంటారా?: - అవినాష్‌రెడ్డి ఇప్పటికి ఆరేడు సార్లు సీబీఐ విచారణకు వెళ్లాడు. - సీబీఐకి సహకరిస్తున్నారు..ఆయన ఎక్కడికీ పారిపోలేదు. ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉన్నారు. - తల్లికి ఆరోగ్య బాగోలేదు.. తండ్రి జైళ్లో ఉన్నారు కాబట్టి తాను ఒక లేఖ రాసి సమయం అడిగారు. - అది కేవలం సీబీఐ, అవినాష్‌రెడ్డికి సంబంధించిన వ్యవహారం. - ఒక వేళ వారు రాష్ట్ర పోలీసులతో మాట్లాడి ఉంటే చట్టప్రకారం వారి పని వారు చేసుకుంటారు. - సీబీఐ కానీ, ఇంకెవరూ దానిపై మాట్లాడటం లేదు. - అవినాష్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్లారు. సుప్రీం కోర్టు.. హైకోర్టుకు వెళ్లమన్నట్లుంది. - ఈ ఎల్లోమీడియా మాత్రం కేంద్ర బలగాలు దిగుతున్నాయి అని రాస్తున్నారు. - వాళ్లే కేంద్ర బలగాలు వస్తున్నాయి అంటారు..మళ్లీ రాకుండా చేశారు అని కూడా వాళ్లే రాస్తారు. - నిన్నంతా ఆ రెండు మూడు చానళ్లు ఇష్టారీతిన డిబేట్లు పెట్టాయి. - సీబీఐకి ఎస్పీ సహకరించడం లేదు అని ఎవరు చెప్పారు..? ఎస్పీ రాధాకృష్ణ చెప్పారా..? సీబీఐ చెప్పిందా..? - నిన్న బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది..దాన్ని తప్పుదోవ పట్టించడానికి ఇదంతా చేశారు. - వాళ్లకి వారుగా క్రియేట్ చేసిన తుఫాన్ ఇది. మీ రాతలు చూస్తే ఎవరికైనా ఆవేదన, ఆవేశం వస్తుంది.: - మా పార్టీ అభిమానులు ఆవేశం, బాధ కలిగినవారు అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు వస్తారు. - మీరు ఇలాంటి రాతలు రాయబట్టే కదా.. వారంతా బాధతో బయటకు వస్తున్నారు..? - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా కార్యకర్తలు లేరనుకుంటున్నారా..? కోట్ల మంది అభిమానులున్నారు... ఎవరికి అన్యాయం జరిగినా వారంతా తప్పకుండా వస్తారు.. - మీరు రాసే ఘోరమైన రాతలు చూస్తే.. ఎవరైనా ఆవేదన, ఆవేశం వస్తుంది. - మీ రాతలతో కుటుంబాన్ని పలుచన చేయాలని చూస్తున్నారు... తల్లి ఆరోగ్యం బాగోలేదంటే డ్రామాలు, నాటకాలు అంటున్నారు. - ఆ తప్పుడు రాతలు చూస్తే ఎవరికైనా కడుపుమండకుండా ఉంటుందా..? మీ మీద ఇలాగే రాస్తే ఊరుకుంటారా..? - వాళ్లిష్టం ఏదైనా అంటారు...నిన్న ఎవరో రాష్ట్రపతి పాలన విధించాలి అంటున్నాడు. - ఆ డిబేట్లలో కూర్చునే వాళ్లని చూస్తే అసలు ప్రపంచ యుద్ధాన్ని కూడా సృష్టించగల శక్తి వారికుందేమో అనిపిస్తుంది. - ఇదంతా చూశాక అభిమానించే మా పార్టీ వారిలో బాధ, ఆక్రోశం రాకుండా ఎలా ఉంటుంది..? - రియల్ మీడియాపై ఎవరిమీదైనా దాడి జరిగిందా..? రాష్ట్రాన్ని దేశానికే దిక్చూచిలా నిలిపిన నాయకుడు శ్రీ వైఎస్‌జగన్ - పార్టీ పెట్టిన 8 ఏళ్లలోనే రీసౌండింగ్ విక్టరీతో 151 స్థానాల్లో విజయం సాధించాం. - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలా అధికారంలోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు ఆ ఫలితాలు వచ్చాయి. - ముందుగానే తయారు చేసుకున్న బ్లూ ప్రింట్ ప్రకారం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గారు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ వస్తున్నారు - మే30న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నాలుగేళ్లలో 98.5 శాతంపైగా హామీలను పూర్తిగా అమలు చేశారు. - ప్రజాస్వామ్యంలో ప్రజలతో మమేకం అయిన పార్టీ పనితీరు ఎలా ఉంటుంది, అలాంటి పార్టీపై ఆశలు పెట్టుకుంటే ఎంత సక్రమంగా అమలు చేసి చూపుతారు అనేది ఈ నాలుగేళ్లలో ప్రస్ఫుటంగా కన్పించింది. - ఈ నాలుగేళ్లలో రాష్ట్రం దేశానికి దిక్చూచిలా నిలబడేలా చేసిన నాయకుడు శ్రీ వైఎస్‌జగన్ - పాలన వికేంద్రీకరణ, గడప వద్దకు పాలన వంటి వాటి ఫలితాలను ప్రజలు అనుభవిస్తున్నారు. - పారదర్శకంగా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం వల్ల పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. జగన్ గారు ఉంటేనే సంక్షేమం-అభివృద్ధి..: - రాష్ట్రంలో పెట్టబడులు వెల్లువలా రావడానికి కారణమయ్యే నాలుగు కీలక పోర్టులను ఈ నాలుగేళ్లలోనే చేపట్టాం. - రామాయపట్నం పోర్టు వచ్చే ఏడాది ప్రారంభం కావచ్చు. మిగిలినవి రానున్న రెండుమూడేళ్లలో పూర్తి అవుతాయి. - మనకున్న సుదీర్ఘ కోస్తా తీరాన్ని వినియోగించుకునేలా వాస్తవ అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తున్నారు సీఎం జగన్ గారు. - జగన్ గారు ఏం చేస్తున్నారు అనేవారికి ఇవన్నీ సమాధానాలు. - అభివృద్ధి అంటే నాలుగు చిన్న ఫ్యాక్టరీలు పెట్టడమే కాదు..చోదక శక్తుల వంటి పోర్టులు, 17 మెడికల్ కాలేజీలు, రోడ్ల విస్తరణ.. లాంటివన్నీ ఆర్ధికాభివృద్ధికి చోదకాలుగా నిలుస్తాయి. - ఒక పక్క పేదరికం నుంచి ప్రజలను పైకి తీసుకురావడం, మరో పక్క ఆర్ధికాభివృద్ధిని పెంపొందించడానికి చోదకశక్తులను ప్రోత్సహించడం చేస్తున్నాం. - పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే జిల్లాల విభజన జరిగింది. - మూడు రాజధానులు వ్యవహారం.. కోర్టు కేసులను దాటుకుని వచ్చిన తర్వాత, ఆచరణలోకి వస్తే ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడుతోంది. - ఇప్పటికే రూ.2.10 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. - జగన్ గారు ఉంటేనే సంక్షేమం, అభివృద్ధి సాగుతుందని ప్రజలు గ్రహించారు. - 2019 ఎన్నికల కంటే రీసౌండ్ విక్టరీ 2024లో ఉండబోతోంది. ఈనాడు కడుపు మంటకు మందే లేదు..: - రూ. 10 వేల కోట్లు ఇచ్చి కేంద్రం ఒక్కసారి పెద్ద ఊరట ఇచ్చిందని ఒక పత్రిక రాసిన వార్తలు చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు. - సమర్ధంగా పనిచేస్తున్నాం... రావాల్సిన నిధులను రాబట్టుకుంటున్నాం. - అవి హక్కుగా రాష్ట్రాలకు రావాల్సినవి...బాధ్యతగా కేంద్రం ఇచ్చే నిధులు. - నిధులు సరిగ్గా మేం తెచ్చుకోలేకపోతే అది ప్రభుత్వ అసమర్దత అవుతుంది. - గతంలో చేయలేనిది ఇప్పుడు మేం చేశాం. - ఈనాడులో వారి కడుపు మంటకు ఏ మందూ పనికిరాదేమో అనిపిస్తోంది. - రాష్ట్రానికి ఊరటో... జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌కి ఊరటో అర్ధం కాని రాతలు రాస్తున్నారు. - విచిత్రంగా డబ్బుల వాన అని రాశారు. కేంద్రం నుంచి రావాల్సింది తీసుకొచ్చాం. - జగన్ గారు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి కావాల్సినవి తీసుకొస్తున్నారు. - వీళ్లే ఒక్కొక్కసారి రాష్ట్రానికి ఎలాంటి నిధులు రాలేదు అని కూడా రాస్తారు.. - ఇప్పుడేమో కేంద్రం కరుణ చూపించిందంటూ రాస్తున్నారు. - చంద్రబాబు కేంద్రంలో పార్టనర్‌గా ఉండి కూడా తీసుకురాలేకపోయాడంటే అది అతని చేతగాని తనం. - ఇన్నాళ్లు జగన్ గారు ఏం చేస్తున్నారు అనేవారికి ఇదే మా సమాధానం. - తన రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు, ప్రజలు తనకు ఇచ్చిన అధికారాన్ని తాకట్టు పెట్టాడు. - ఓటుకు కోట్లు ఎరవేసిన కేసులో పరారై ఇక్కడకు ఎలా వచ్చాడో... అలానే కేంద్రంలో కూడా తన వ్యక్తిగత అవసరాలనే చూసుకున్నాడు. రాష్ట్రానికి మంచి జరిగినా భరించలేనితనం: - రాష్ట్రానికి రావాల్సిన నిధులకు.. ఏదైనా అడ్డంకి వచ్చిందటే వారికి ఎంతో ఆనందం. - వారు చెప్పినట్టుగా జరగకపోతే ఎన్జీటీ, కేంద్రం మీద కూడా తప్పుడు రాతలు రాస్తారు. - రాష్ట్రాన్ని వీరంతా కలిసి ఏం చేయాలనుకుంటున్నారో అర్ధం కావడం లేదు. - చంద్రబాబును అర్జెంటుగా ఆ కుర్చీలో కూర్చోబెట్టాలనే దుగ్ధతో రాష్ట్రానికి మంచి జరిగినా భరించలేని తనం వారిలో కన్పిస్తోంది. - ఎక్కడో తెలంగాణాలో కూర్చుని వారు రాసేరాతలు చూస్తుంటే వీరికి రాష్ట్రంపై ప్రేమ ఉండే అవకాశం ఏమాత్రం లేదనిపిస్తుంది. - వీళ్లంతా నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...హైదరాబాద్‌లో కాపురం ఉంటున్నారు. - రాష్ట్రంపై ఎటూ ప్రేమ లేదు... రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగితే వీరికి బాధ. చెడు జరిగితే వారికి ఆనందం - దానికి తోడు వారి కడుపులోని కుళ్లు నగ్నంగా చూపెట్టుకుంటున్నారు. - నిధులు వచ్చినా, రాకపోయినా పట్టుదలగా చెప్పిన ప్రకారం చెప్పినట్టు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మాది. - చంద్రబాబులా, తన స్వార్థం కోసం అధికారాన్ని వినియోగించుకునే వ్యక్తి జగన్ గారు కాదు - వ్యక్తిగత అవసరాల కోసం అధికారాన్ని వాడుకునే వాడు అయితే పరిస్థితి వేరేలా ఉండేది. - కాదు కాబట్టే చంద్రబాబుపై కేసులు నాలుగేళ్లపాటు కోర్టులు దాటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. - చంద్రబాబు హయాంలో దారుణమైన స్కాంలు, దోపిడీలు జరిగినా.. చట్టం తన పని తాను చేయాలని వదిలేశారు.