సీఎం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

రక్తదాన కార్యక్రమ పోస్టర్, ప్రత్యేక వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

19న రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాపోటీలు, 20న మొక్కలు నాటడం, 21న సేవా కార్యక్రమాలు చేపట్టాలి

వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులకు పిలుపు

తాడేపల్లి: ఈనెల 21న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న రక్తదాన కార్యక్రమ పోస్టర్, ప్రత్యేక వెబ్‌ సైట్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్క‌రించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూదన్‌రెడ్డి, పద్మజ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. సీఎం బర్త్‌ డే వేడుకల్లో కోట్లాది మంది అభిమానులతో పాటు సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారంతా పాల్గొంటారన్నారు. గతంలో పార్టీ కార్యకర్తలు 38 వేల యూనిట్ల రక్తదానం చేశారని, ఈసారి వైయస్‌ఆర్‌ సీపీ బ్లడ్‌ డొనేషన్‌.కామ్‌ పేరిట వెబ్‌సైట్‌ ప్రారంభించామని చెప్పారు. వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకుంటే అవసరమైనప్పుడు రక్తదానం చేసే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పుట్టినరోజును పురస్కరించుకొని ఈనెల 19న రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాపోటీలు, 20వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమం, 21న పేదలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  

ఐదేళ్లు పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్తాం
‘‘చంద్రబాబు ముందస్తు ఎన్నికలు అంటున్నారు. టీడీపీలో ఊపులేకే చంద్రబాబు ముందస్తు మాటలు. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. ఐదేళ్లు పూర్తయ్యాక ప్రజలకు చెప్పి ఎన్నికలకు వెళ్తాం. పొత్తులు, ఎత్తులు లాంటి చొచ్చు ఆలోచనలు మాకు లేవు. చంద్రబాబు ఎప్పుడూ మాయమాటలు చెబుతుంటారు.’’ 

 తెలుగుదేశం పార్టీకి ఊపు కనిపించడం లేదని,ముందస్తు ఎన్నికలంటూ మాట్లాడటంవల్ల  కార్యకర్తలు నలుగురు వస్తారనే దింపుడు కళ్ళెం ఆశతో చంద్రబాబు మాట్లాడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి   సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.  చంద్రబాబుకు తోడు ఆయన అనుకూల మీడియా కూడా అదే పాట పాడుతోందని అన్నారు. నిజానికి చంద్రబాబు పిలుపునకు స్పందన కరవుతుండటంతో ఇలా చేస్తున్నారని తెలిపారు.

    మాకు సంబంధించినంతవరకు ఇప్పటికే పలుమార్లు చెప్పాం. ముందస్తు,వెనకస్తు అంటూ ఏమీ ఉండదు. ప్రజలకు మాకు ఐదుసంవత్సరాలపాటు పరిపాలించమని అధికారం ఇచ్చారు. ఆ సమయం వరకు పాలన అందిస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని ఇప్పటికే అమలు చేశాం. చెప్పనివి కూడా ప్రజలకు మేలు చేసేవి ఇంకా చాలా పథకాలు అమలు చేశాం. ఐదు సంవత్సరాలలో చెప్పిన వాగ్దానాలన్నింటిని అమలు చేశాం మళ్ళీ మీ బ్లెస్సింగ్ కావాలని ప్రజల వద్దకు వెళ్ళాలనేదే శ్రీ వైయస్ జగన్ గారి ఆలోచన. రాత్రికి రాత్రే ఏదో మారిపోతుంది. లెక్కలు మారిపోతాయి. గ్రహగతులు సరిగా లేవు. లేదా ఆ పార్టీ ఈ పార్టీ కలుస్తాయి...మరేదో పార్టీలు విడిపోతాయోమో....ఈ వర్గాలలో వ్యతిరేకత వస్తుందేమో...ఇలాంటి చచ్చుఆలోచనలతో పార్టీలు నడిపేవారి ఆలోచనలు తప్ప మరోటి కాదు. ప్రజల తీర్పు మేరకు మా పార్టీ పూర్తిగా పరిపాలన అందిస్తుంది. టిడిపి వారి కార్యకర్తలలో ఉత్సాహం నింపడానికో...యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికో...సెల్ఫ్ మోటివేషన్ కోసమో అలా చేస్తున్నారు. వారి ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు అని స్పష్టం చేశారు.

కౌలురైతులభరోసా యాత్రపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ చరిత్రలో తొలిసారిగా శ్రీ వైయస్ జగన్ గారు(గతంలో వైయస్సార్ కొంత ప్రయత్నం చేశారు) భూమి యజమాని ఇబ్బంది పడకుండా కౌలు అనేది 11 నెలలకు సింప్లిఫై చేస్తూ కౌలు తీసుకునే రైతుకు పట్టాదారు అయిన రైతుకు ఇచ్చే బెనిఫిట్స్ మొత్తం ఇస్తూ ఒక స్పష్టమైన విధానం తీసుకువచ్చారు. ఇది అందరికి తెలిసిందే. ఒకవేళ ఏ కారణాలవల్ల కౌలు రైతులు ఇబ్బంది పడుతుంటే ఇంకా ఏం న్యాయం చేయగలమో అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈరోజు పవన్ కల్యాణ్ ఏదైతే చేస్తానంటున్నారో ఆయన ముందు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏమంటే కౌలురైతులకు సంబంధించి ఇంతకుమించి మెరుగైన విధానం ఏదైనా ఉంటే అది ప్రభుత్వానికి చెప్పవచ్చు. గతంలో యజమానితో అగ్రిమెంట్ కుదిరినా ప్రభుత్వాలు సహాయం చేసేవి కాదు. శ్రీ వైయస్ జగన్ గారు పూర్తి శ్యాచురేషన్ బేసిస్ పై కౌలు రైతులకు బెనిఫిట్స్ అందిస్తున్నారు. తాను వచ్చి కౌలురైతులకు ఏదో చేస్తున్నానని చెప్పడం,తాను పోయిఎక్కడ ఇస్తున్నాడో తెలియదు. ఇక్కడో లక్ష అక్కడో లక్షరూపాయలు ఇస్తున్నానని చెప్పి తాను ప్రజాసేవ చేస్తున్నాను అంటూ నాలుగు ఫోటోలు తీసుకుంటున్నారు.దానివల్ల ఉపయోగం ఉండదు.సమస్య సాల్వ్ కాదు.

 సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన అంశాలపై వేసిన అఫడవిట్ గురించి కొందరు చేస్తున్న విమర్శలను గురించి మాట్లాడుతూ విభజన అంశాల విషయంలో ఏపి ప్రయోజనాలు కాపాడేవిషయంలో శ్రీ వైయస్ జగన్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇది మేం తొలినుంచి చెబుతున్నాం. దానిలో భాగంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. విమర్శలకు సమాధానం చెప్పాలంటే తాము తొలినుంచి ఏం చేస్తున్నామో చిట్టా అంతా తీసిి చెప్పాల్సి ఉంటుంది. అయినా కోర్టుకు వెళ్లాలంటే చాలా అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఒక్కరోజులో అయ్యే పనికాదనేది వాస్తవం గమనించాలి అని అన్నారు. విభజన అనంతరం మనకు రావాల్సినవి ఏమున్నాయో వాటికి సంబంధించి వత్తిడి బిల్డ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేరే రకంగా మేం వెనకడుగు వేశామో అర్ధం కావడంలేదన్నారు.ఈ మూడున్నరేళ్లు పట్టించుకోకుండా ఈరోజు ఉన్నట్టుండి వేస్తే అనుకోవచ్చు. గతంలో పవర్ కు సంబంధించి వచ్చింది. తెలుగుఅకాడమికి సంబంధించి వచ్చింది. మిగిలిన వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూనే ఉన్నాం. కేంద్రం దగ్గర పలుమార్లు సమావేశాలు జరుగుతున్నాయి. శ్రీ వైయస్ జగన్ గారి ప్రభుత్వం ఏ విషయంలోనూ స్పేర్ చేసే పరిస్ధితి లేదు. చంద్రబాబు 2014-19 మధ్య నిర్లక్ష్యం చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కు సంబంధించి అలానే చేసి నష్టం చేకూర్చారు.  ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఆ విషయంలో రాష్ర్టానికి మోసం, అన్యాయం జరిగింది. ఎప్పుడు అవకాశం ఉన్నా రెయిజ్ చేస్తాం. దానిని ప్రశ్నించడానికి వీధుల్లోకి ఎక్కి ఏదైనా చేయడానికి దానికి ఎండ్ అంటూ ఉండేది కాదు. రెండు దేశాల మధ్య యుద్దం కాదు.
 కేేంద్రాన్ని కన్విన్స్ చేయాలి. పోలిటికల్ డెసిసన్ కావాల్సింది. అలా అయ్యే సమయం కోసం చూస్తున్నారు. అంతవరకు ఆ డిమాండ్ గట్టిగా వినిపించడం, ఏ ఫ్లాట్ ఫామ్ దొరికినా దానికోసం సిన్సియర్ గా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదే మా పార్టీ చేస్తోంది.

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రైతులు చేయనున్న ధర్నాపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ  అమరావతి రైతులు వాయిస్ ఎక్కడ వినిపించినా అది ఉద్యమం అనేది ఎవ్వరూ అంగీకరించడం లేదు. నిజమైన రైతులు అక్కడ భూములు విక్రయించేసుకున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉద్యమం మాత్రమే. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పబ్లిసిటి స్టంట్ కోసం ఉపయోగపడుతుంది. టిడిపి నేతలు హడావుడి చేయడానికి కుదురుతుంది.

జననేత జగనన్న జన్మదిన సందర్భంగా మనమంతా రక్తదానం చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. -ప్రతిజ్ఞ చేయటానికి ఈ క్రింది ఉన్న లింక్ క్లిక్ చేయండి 👇🏻 www.ysrcpblooddonation.com - ఈ ప్రతిజ్ఞతో రక్త గ్రహితకి రక్తం ఎప్పుడు అవసరం అయితే అప్పుడే మిమ్మల్ని సంప్రదిస్తారు - అందరూ స్వచ్ఛందంగా మీ వివరాలు నమోదు చేయగలరు అని మనవి.

Back to Top