తాడేపల్లి : ఏ సమస్యనైనా ఉన్నత న్యాయస్థానాలే పరిష్కరించాలని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చిన్న చిన్న ఘటనలను రాష్ట్రం మొత్తానికి ఆపాదించడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధంగానే వ్యవస్థలు ఏర్పడ్డాయని.. ఏ వ్యవస్థ అయినా ఇతర వ్యవస్థలను గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పిచ్చి రాతలు ఆశ్చర్యపరిచాయి.. ఎల్లోమీడియా ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. హైకోర్టును మూసేయమనండి అంటూ రాసిన పిచ్చి రాతలు ఆశ్చర్యపరిచాయి. రాజకీయ వ్యవస్థ బాగుందని మేం అనడం లేదు. అలాగని మిగతా వ్యవస్థలు బాగున్నాయని కూడా చెప్పలేం. న్యాయస్థానాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయాలనుకుంటే రికార్డ్ చేసి తీర్పులో భాగం చేయాలి. ప్రజా సేవకులుగా ఏపీ పోలీసులు ఉన్నతమైన సేవలందిస్తున్నారు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య చిచ్చుపెట్టడానికి ఎల్లోమీడియా ప్రయత్నిస్తుంది. ఈ విషయమై గౌరవ న్యాయమూర్తులు, న్యాయస్థానాలు గుర్తించాలని కోరుతున్నానంటూ ' తెలిపారు. చప్పట్లతో అభినందిద్దాం.. 'గ్రామస్వరాజ్య స్థాపన దిశగా పయనిస్తున్నామని.. గ్రామ సచివాలయ వ్యవస్థతో గడప వద్దకే సేవలు అందిచనున్నాం. ఏడాదిలో ఒక వ్యవస్థను పకడ్బందీగా తీర్చిదిద్దాం. తక్కువ సమయంలోనే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ విజయవంతమైంది. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు అందరూ సంఘీభావం తెలపాలి. రాత్రి 7 గంటలకు ఇంటి బయటకొచ్చి చప్పట్లతో అభినందించాలంటూ ' సజ్జల పేర్కొన్నారు.