ఏపీ సీఎం సహాయనిధికి రాంకీ రూ. 5 కోట్ల విరాళం

సీఎంను కలిసి చెక్కు అందించిన ఎండీ గౌతంరెడ్డి

రూ. 2 కోట్ల విలువైన పీపీఈ కిట్లు కూడా

తాడేపల్లి: కరోనా వైరస్‌పై పోరుకు రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది. తన వంతు సాయంగా ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సహాయనిధికి రూ. 5 కోట్ల విరాళం అందజేసింది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన రాంకీ ఎండీ, సీఈవో ఎం.గౌతంరెడ్డి, ఆళ్ల శరణ్‌లు చెక్కును అందజేశారు. విరాళంతోపాటు రెండు కోట్ల రూపాయల విలువైన పీపీఈ కిట్లను కూడా అందించనున్నట్టు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ.. కనిపించని శత్రువుతో పోరాడేందుకు అందరూ ఏకం కావాల్సి ఉందన్నారు. వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని కోరారు.

Back to Top