తాడేపల్లి: వరల్డ్ కప్‌లో మహిళా క్రికెట్ టీమ్ విజయం సాధించటంపై వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. ఈ అద్భుతమైన విజయం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. కడప అమ్మాయి శ్రీచరణి ఛాంపియన్ జట్టులో భాగం కావడం విశేషం అని అన్నారు. వైయస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. ‘భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీంవర్క్, వారి ఆత్మవిశ్వాసం దేశాన్ని గర్వపడేలా చేసింది. వరల్డ్‌కప్‌ను అందుకుంది. కడప అమ్మాయి శ్రీచరణి ఛాంపియన్ జట్టులో భాగం కావడం విశేషం. ఈ అద్భుతమైన విజయం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఈ గెలుపు ప్రతి భారతీయుడు పెద్ద కలలు కనడానికి ఒక ప్రేరణ’ అని అభినందనలు తెలిపారు.