క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు విన‌తి

నంద్యాల‌:  క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల‌ని న్యాయ‌వాదులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కోరారు. రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు కొలిమిగుండ్ల మండ‌లానికి వ‌చ్చిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు న్యాయ‌వాదులు విన‌తిప‌త్రం అంద‌జేశారు. హెలిప్యాడ్‌ వద్ద సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్‌ను  కర్నూలు జిల్లా బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు క‌లిశారు. 
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలంటూ కర్నూలులో గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న న్యాయవాదులు, హైకోర్టును అమరావతి నుంచి కర్నూలు తరలించే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్న న్యాయవాదులు. శ్రీ భాగ్‌ ఒప్పందాన్ని అమలు చేయాలని సీఎంకి వినతిపత్రం అందజేసిన న్యాయవాదులు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంఆర్‌ కృష్ణరంగడు, పుల్లారెడ్డి, జయరాజ్, ఓంకార్, రవిగువేరా, నరసింహ బద్దల్, లక్ష్మినారాయణ తదితరులు.

తాజా వీడియోలు

Back to Top