రాజంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి

రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి

అన్నమయ్య జిల్లా: ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజంపేట మున్సిపాలిటీకి కృషి చేస్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. శుక్ర‌వారం రాజంపేట మునిసిపల్ కార్యాలయంలో చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన కౌన్సిల్  సర్వసభ్య సమావేశంలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి, ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే ఆకేపాటి అమ‌ర్నాథ్‌రెడ్డి పాల్గొన్నారు. 
కౌన్సిల్ సమావేశంలో  పలు అభివృద్ధి కార్యక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ తీసుకున్న నిర్ణయాలను చూసి ఓర్వలేక సమావేశం నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే అమ‌ర్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజంపేటలో అభివృద్ధి పనులు చేపడుతుంటే చూసి అభినందించాలి తప్ప ఓర్వలేని తనం చూపడం టీడీపీకి తగ‌ద‌న్నారు. సంవత్సరానికి లక్షల్లో నిధులు మిగులు చూపెడుతూ ఉంటే దానిని కూడా అడ్డుకోవడం టీడీపీకి మంచిది కాద‌న్నారు.
 
రెండు ట్రాక్ట‌ర్ల విత‌ర‌ణ‌

రాజంపేట మున్సిపాలిటీకి  రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి రెండు కొత్త ట్రాక్టర్లను విత‌ర‌ణ‌గా ఇచ్చారు, చెత్త సేకరణకు ఎంపీ నిధుల నుంచి రెండు ట్రాక్టర్లను రాజంపేట మున్సిపాలిటీ అంద‌జేశారు. కొత్త  ట్రాక్టర్లకు ఎంపీ(రాజ్యసభ) మేడా రఘునాథ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమ‌ర్నాథ్‌రెడ్డి, ఛైర్మెన్ పోలా శ్రీనివాసుల రెడ్డి  పూజ చేసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఎంపీ(రాజ్యసభ) నిధుల నుండి రాజంపేట మున్సిపాలిటీకి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తాన‌ని మేడా రఘునాథ రెడ్డి హామీ ఇచ్చారు.

Back to Top