ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టండి...

ప్రజాస్వామ్యంలో బాబు వంటి నేతలకు చోటు ఉండకూడదు.

వైయ‌స్‌ జగన్‌ను దించేందుకు అందరూ కలవాలనడం దురదృష్టకరం

 పేదలకు మంచి చేస్తున్నందుకు వైయ‌స్ జగన్‌ సీఎంగా ఉండొద్దా?

  రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు సూటి ప్రశ్న.

విజ‌య‌న‌గ‌రం: ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాల‌ని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పిలుపునిచ్చారు. రేగిడి ఆమదాలవలస మండలం, పెద్దశిర్లాం గ్రామ పంచాయితీ, గ్రామ సచివాలయ పరిధిలో బుడితిపేట గ్రామంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఇంటింటా ప‌ర్య‌టించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అందించిన సంక్షేమ ప‌థ‌కాల గురించి ఆరా తీశారు.  

ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గద్దెదించాలన్న ఆలోచన చేస్తున్న ప్రతిపక్షాలకు ఆ ప్రజలే సరైన బుద్ధి చెప్పాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పిలుపునిచ్చారు. అధికారంలో ఉండగా ఏమీ చేయలేని చంద్రబాబు.. ఇప్పుడు జరుగుతున్న మంచిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.  

చంద్రబాబు తన పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో వైయ‌స్‌ జగన్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ల మూడు నెలలైందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం సందర్భంగా సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తున్నామని చెప్పారు. పథకాలు సరిగా అందుతున్నాయా? లేదా? అని తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చామన్నారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. వైయ‌స్ జగన్‌ను సీఎం పీఠం నుంచి దించేయాలని, అందుకు అందరూ ఏకం కావాలని చెప్పడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు వంటి నాయకులకు ప్రజాస్వామ్యంలో చోటు లేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నందుకు వైయ‌స్ జగన్‌కు దించేయాలా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు చంద్రబాబు ఏమీ చేయలేదని అన్నారు. గతంలో టీడీపీ, బీజేపీ కలిసే ఉన్నాయని.. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఇద్దరూ భాగస్వాములుగా ఉండి ఏం సాధించారని ప్రశ్నించారు. విభజన చట్టంలోని అంశాలను ఎందుకు సాధించలేకపోయారో ప్రజలకు సమాధానం ఇవ్వాలన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వికేంద్రీకరణే సరైన మార్గమని చెప్పారు.  కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు,  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Back to Top