హైదరాబాద్: సార్వాత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన రావాలి జగన్..కావాలి జగన్ అనే కొత్త పాటను ఇవాళ విడుదల చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలు ఈ పాటను ఆవిష్కరించారు. ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకునే విధంగా రూపొందించిన ఈ పాటలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని..వైయస్ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలని ఆకాంక్షించే విధంగా పాటను రూపొందించారు. ఈ పాటను అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు తమ ప్రచారంలో ఉపయోగించుకోవాలని పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి సూచించారు. ప్రచార వాహనంలో ఈ పాటను ప్లే చేస్తూ ర్యాలీలు నిర్వహించాలన్నారు. రావాలి జగన్ పోస్టర్లతో జిల్లా పార్టీ కార్యాలయాన్ని అలంకరించి, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి పార్టీ ప్రచార పాటను పగటి పూట ప్లే చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో / వార్డుల్లో బ్రాండెడ్ ఆటో-మైకింగ్ ద్వారా పార్టీ ప్రచార పాటను తదుపరి వారం రోజుల పాటు ప్లే చేసేలా చూసుకోవాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈ పాటను డౌన్‌లోడ్ చేసుకుని, ఫోన్ రింగ్ టోన్ లాగా సెట్ చేసుకోవాన్నారు. పార్టీ కార్యకర్తలు కూడా ఇదే విధంగా చేసేలా చూసుకోవాలన్నారు. రావాలి జగన్..కావాలి జగన్ పాట డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..