సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన పీవీ సింధు

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు కొద్దిసేపటి క్రితం మర్యాదపూర్వకంగా కలిశారు.  సచివాలయంలో సీఎంను కలిసిన సింధును ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందించారు. సీఎంను కలిసిన వారిలో సింధు తల్లిదండ్రులతో పాటు  మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు  ఉన్నారు.

దశాబ్దాలుగా భారతీయులకి అందని ద్రాక్షగా మిగిలిపోయిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌‌ పసిడి పతకాన్ని పీవీ సింధు ఇటీవల సాధించారు. జపాన్ షట్లర్ ఒకుహరాతో బాసెల్‌ (స్విట్జర్లాండ్) వేదికగా జరిగిన ఫైనల్లో 21-7, 21-7 తేడాతో సింధు అలవోకగా నెగ్గి.. ఈ టోర్నీలో స్వర్ణం సాధించిన తొలి భారత షట్లర్‌గా రికార్డ్‌ నెలకొల్పిన విషయం తెలిసిందే.

Back to Top