సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన పీవీ సింధు, ర‌జని

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ.రజని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఇటీవ‌ల జ‌రిగిన కామ‌న్వెల్త్ గేమ్స్‌ బ్యాడ్మింట‌న్ సింగిల్స్ విభాగంలో భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వ‌ర్ణం గెలిచింది. గోల్డ్ మెడ‌ల్ సాధించిన సింధును సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. అదే విధంగా అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ.రజని హాకీ స్టిక్‌ను, జెర్సీని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిశీలించారు. ఇరువురు క్రీడాకారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి రోజా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ చైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top