

















విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మండలి ఛైర్మన్ గా నియమితులైన పులి సునీల్ కుమార్ సోమవారం పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కడప ఎం. పి వైయస్ అవినాష్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే లు రవీంద్రనాథ్‌రెడ్డి, మేరుగ నాగార్జున, కార్పొరేషన్ ఛైర్మన్లు, వైయస్ఆర్‌సీపీ నాయకులు బొప్పన భవకుమార్, గౌతంరెడ్డి, గ్రంధివేముల బాలన్న, తదితరులు పాల్గొని సునీల్‌కుమార్‌ను అభినందించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్నారెడ్డి మాట్లాడుతూ..సీఎం వైయస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా కార్పొరేషన్ చైర్మన్‌లు పని చేయాలన్నారు. సీఎం వైయస్ జగన్ అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నారని తెలిపారు. అట్టడుగు వర్గాల ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేస్తున్నారని చెప్పారు. మంత్రి వర్గ కూర్పులోనూ సీఎం వైయస్ జగన్ సామాజిక న్యాయం పాటించారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారని వివరించారు.