అనంతపురం: ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టు కూటమి ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట అని వైయస్ఆర్‌సీపీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. మిధున్‌రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఆదివారం గుంతకల్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు వై. వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ యాదవ్ మాట్లాడుతూ..వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ని కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ కావాలనే కక్ష సాధింపు ధోరణితో నిన్నటి రోజున అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా కేవలం ప్రశ్నిస్తున్నారనేటువంటి నేపముతో వైయస్ఆర్‌సీపీ నాయకుల పైన కార్యకర్తల పైన అక్రమ అరెస్టులు చేస్తూ దాడులు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి నారా లోకేష్ ప్రవేశపెట్టినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అన్నారు. వైయస్ జగన్ పరిపాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు తప్ప ఇలా కక్ష సాధింపు దూరంలో చేయలేదన్నారు. కూటమి నాయకులు అధికారులను అడ్డం పెట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తూ వైయస్ జగన్ చుట్టూ ఉన్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకున్నప్పటికీ కావాలనే వారిపైన అక్రమ అరెస్టులు చేయటం నియంతృత్వానికి పరాకాష్ట అన్నారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలో చేపట్టిన తర్వాత మద్యపానాన్ని నియంత్రిస్తూ ఒక పద్ధతిలో ప్రభుత్వమే మద్యం నడిపే విధంగా ఆన్లైన్ పద్ధతిలో ప్రభుత్వానికి లాభం వచ్చే విధంగా చేశారన్నారు. ప్రభుత్వమే మద్యం నడిపినప్పుడు అవినీతి ఏ విధంగా జరుగుతుందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మద్యపానాన్ని ఇష్టానుసారంగా నియంత్రణలు లేకుండా పాఠశాలల వద్ద దేవస్థానాలు వద్ద ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిత్యం మద్యం దొరికే విధంగా మద్యపాన రాష్ట్రంగా కూటమి ప్రభుత్వం చేసిందన్నారు. వైయస్ఆర్‌సీపీ 2019 నుంచి 2024 సంవత్సరంలో ఒక్కటంటే ఒక్కటి నూతనంగా మద్యం కంపెనీలకు పర్మిషన్లు ఇవ్వలేదన్నారు. ఏపీలో ఉన్న లిక్కర్ డిస్టిలరీలకు పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబే డీస్లరీలు అన్ని బాబు బినామీలవే. బాబు బినామీల డీస్లరీల్లో జగన్ అవినీతి ఎలా చేస్తాడు అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీ నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులు పేరుతో బెదిరించాలని చూస్తుందన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు భయపడే ప్రసక్తి లేదన్నారు. ఈ అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం నాయకులు రాష్ట్రంలో సంక్షేమ పథకాల పైన అభివృద్ధి పైన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన శ్రద్ధ పెట్టాలని కక్ష సాధింపు ధోరణిలు మానుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని రాబోవు రోజుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఎవరైతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు వారందరికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా కమిటీ సభ్యుడు సాయి సునీల్, విద్యార్థి విభాగం గుంతకల్ నియోజవర్గ అధ్యక్షుడు నక్క నాగప్ప, బీసీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు రంగనాయకులు, ఎస్టీ సెల్ నియోజవర్గ అధ్యక్షుడు కొనకొండ్ల అంజి,ఐటి వింగ్ నియోజవర్గ అధ్యక్షుడు సూర్య రెడ్డి, వైయస్ఆర్‌సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు శివ, కార్యదర్శి సూర్య, వాలంటీర్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు పవన్ కుమార్, యువజన విభాగం గుంతకల్ పట్టణ,మండల అధ్యక్షుడు బోయ మనోజ్ కుమార్, శాంతా నాయుడు,పట్టణ ఉపాధ్యక్షులు కురుబా లింగ, ప్రశాంత్, మండల ఉపాధ్యక్షుడు గోవిందు, కార్యదర్శులు చిన్న,రాఖి, జాఫర్, విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షుడు మణికంఠ, నాయకులు కేశవ,పవన్, ఎస్సీ సెల్ పట్టణ ఉపాధ్యక్షులు రంగస్వామి, ఐటి.విభాగం పట్టణ అధ్యక్షుడు దాదా ఖలందర్, మైనార్టీ విభాగం పట్టణ ఉపాధ్యక్షులు దాదు, మైనార్టీ నాయకులు జిలాన్, తదితరులు పాల్గొన్నారు.