357 ఫిట్‌నెస్ లేని బ‌స్సులు సీజ్‌

మంత్రి పేర్ని నాని

మంత్రిగా బాధ్యతలు స్వీకర‌ణ‌

అమరావతి : ఈ నెల 13 నుంచి ఫిట్‌నెస్‌లేని 624స్కూల్‌ బస్సులపై కేసులు బుక్‌ చేశామని, ఇప్పటిదాకా 357 బస్సులను సీజ్‌ చేశామని, ఆ వివరాలన్నింటిని ప్రజల ముందు ఉంచుతామని రవాణా, సమాచారం శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.  సచివాలయంలో ఐదో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఆర్టీసీ బస్‌ పాసులు మూడేళ్లకు ఒకసారి తీసుకునేలా మొదటి ఫైలుపై సంతకం చేశారు.

మెట్రో నగరాల్లో 350 ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. రవాణాశాఖ కార్యాలయాల్లో కూడాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కొత్త వాహనాల కొనుగోలు సమయంలో డీలర్‌ వద్దనే రిజిస్ట్రేషన్‌ చేయించాలన్నారు. 24 గంటల్లోనే ఆర్టీవో అప్రూవల్‌ ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top