జననేతే...ప్రభుత్వాధి నేత

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి ఖాయమని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేటతెల్లం చేశాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని   వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించనున్నదన్న అంచనాలు వాస్తవ రూపం దాల్చనున్నాయని స్పష్టమైంది. దేశ వ్యాప్తంగా సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం , పోలింగ్ సరళిపై  వివిధ సంస్థలు రాష్టంలో వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రానున్నదని ఎగ్జిట్  పోల్ ద్వారా వెల్లడించాయి. అసెంబ్లీలోనే కాకుండా, లోకసభ స్థానాల్లో కూడా వైయస్ఆర్ సీపీ రికార్డు మెజార్టీని సాధించనున్నని తెలిపాయి.

►లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది. టీడీపీ​కి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలిపింది.

► ఆరా సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీకి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని తెలిపింది. టీడీపీకి 1 నుంచి 5 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.

అసెంబ్లీ ఎన్నికల్లో...

►ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 130 నుంచి 133 వరకు సీట్లు వస్తాయని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌(సీపీఎస్‌) అంచనా వేసింది. టీడీపీకి 43 నుంచి 44 స్థానాలు దక్కే అవకాశముందని పేర్కొంది. జనసేన పార్టీకి సున్నా నుంచి ఒక స్థానం రావొచ్చని తెలిపింది.

►వైఎస్సార్‌సీపీకి 112, టీడీపీ 59, జనసేనకు 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పీపుల్స్‌ పల్స్‌ సర్వే వెల్లడించింది. వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 21 లోక్‌సభ స్థానాలు గెల్చుకునే అవకాశముందని తెలిపింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు దక్కనున్నాయని అంచనా కట్టింది. జనసేనకు ఒక స్థానం రావొచ్చని తేల్చింది.

►ఆరా సర్వేలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 126 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 47, జనసేన పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది.

►వీడీపీ అసోసియేట్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైఎస్సార్‌సీపీకి 111 నుంచి 121 సీట్లు వస్తాయి. టీడీపీకి 54 నుంచి 64 స్థానాలు దక్కుతాయి. జనసేనకు 4 సీట్లు వచ్చే అవకాశముంది.

►ఐపల్స్‌ సర్వే ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 110 - 120, టీడీపీకి 56 - 62, జనసేన పార్టీ 0 - 3 స్థానాలలో విజయం సాధిస్తాయి.

► కేకే సర్వే ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 130 - 135, టీడీపీ 30 - 35, జనసేన పార్టీ 10 - 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి

►  మిషన్‌ చాణక్య సర్వే ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 98 స్థానాల్లో, టీడీపీ 58 స్థానాల్లో, జనసేన పార్టీ 7 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధిస్తారని అంచనా వేశారు.

Back to Top