ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు..

దాడులతో విష సంస్కృతి రాజ్యమేలుతోంది...

ఈ నాలుగేళ్లన్నరేళ్లలో ఒక్క రాజకీయ విమర్శ కూడా చేయలేదు..

ప్రజలను కాపాడుకోవలసిన బాధ్యత నాపై ఉంది..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

తిరుపతి: ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఈ నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో ఒక సభలో కూడా  రాజకీయ విమర్శలు చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అన్నారు. విష సంస్కృతి రాజ్యమేలుతుందని, దాడులు జరగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చని పల్లెలు ప్రశాంతంగా ఉండాలని  కోరుకునే వ్యక్తినని, రాజకీయాలకతీతంగా అందరిని కలుపుకుని పోయే వ్యక్తిత్వం గలవాడనని అన్నారు.  ఈ నాలుగేన్నరేళ్లలో ఒక్క రాజకీయ విమర్శ కూడా నియోజకవర్గ సభలో చేయలేదన్నారు. పార్టీలకతీతంగా టీడీపీ చెందినవారికే పనులు ఇచ్చానని తెలిపారు. నియోజకవర్గం ప్రజల మనోభావాలు, వారి జీవన స్థితిగతులు తెలుసు అని, ఉద్యోగులు,కష్టజీవులైనా నియోజకవర్గ ప్రజలు అభ్రదతా భావంతో ఉన్నారన్నారు. దాడులతో చంద్రగిరి ప్రజలు భయభ్రాంతులవుతున్నారన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే అధికారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశాను తప్ప.పార్టీలకు వ్యతిరేకంగా  ఎన్నడూ  పోరాటాలు చేయలేదన్నారు. ఇదే నియోజకవర్గంలో పుట్టి పెరిగానని, ఇక్కడే చదువుకున్నానని,విద్యార్థి నాయకుడిగా గెలిచానని,జడ్పీటీసీగా పదవులు నిర్వహించానని, ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలను కాపాడుకోవలసిన బా«ధ్యత నాపై ఉందన్నారు .తప్పు ఎవరు చేసిన వదల వద్దని నా నియోజకవర్గంలో ప్రతి పోలీసులకు చెబుతానన్నారు. తప్పును ప్రోత్సహించేది లేదన్నారు. ఉద్యమాలు చేశాను తప్ప.. ఎక్కడా రౌడీయీజం,అక్రమాలు చేయలేదన్నారు.సమస్యలపైన మాత్రమే పోరాటాలు చేశానన్నారు.

Back to Top