ఇళ్ల వ‌ద్ద‌కే పింఛ‌న్లు

 ఏపీలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ
 

 అమరావతి:ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైయ‌స్ఆర్ పింఛ‌న్ కానుక పంపిణీ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఇళ్ల వ‌ద్ద‌కే వాలంటీర్లు వెళ్లి ల‌బ్ధిదారుల‌కు పింఛ‌న్ పంపిణీ చేస్తున్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి పింఛన్ల పంపిణీ  ప్రారంభమైంది. ఉదయం 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 58.23 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 61.28 లక్షల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.1478.90 కోట్లు విడుదల చేసింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంచుతున్నారు.

ఈ నెల నుంచి కొత్తగా 2,20,385 మందికి పెన్షన్లు మంజూరయ్యాయి. రాష్ట్రంలో 2.68 లక్షల మంది వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల చేతికే పెన్షన్‌ అందిస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా అందిస్తున్న పెన్షన్లను కూడా ప్రభుత్వం పెంచింది. వారికి వైఎస్సార్‌ కానుక కింద వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ జరుగుతుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా బయోమెట్రిక్‌కు బదులు జియో ట్యాగింగ్‌తో కూడిన ఫోటోలను తీసుకుని పెన్షన్ పంపిణీ చేస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top