రాష్ట్రమంత‌టా పింఛన్ల‌ పండగ 

ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్

ఎచ్చెర్ల‌:  పేద ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా పింఛన్లు సొమ్ము పెంచడంతో పాటు నూతన పింఛన్లు మంజూరు చేయడంతో రాష్ట్రమంతటా పింఛన్ల‌ పండగ జరుగుతుందని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. గురువారం ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో  మండలానికి సంబంధించి వైయ‌స్ఆర్‌ పింఛన్ కానుక ద్వారా కొత్త‌గా మంజూరైన పింఛ‌న్ల‌ను   ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్  లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ..  పింఛ‌న్ సొమ్ము రూ.2500 నుంచి రూ. 2750 వ‌ర‌కు పెరిగింద‌న్నారు. వీటితో పాటు కొత్త‌గా 320మంది లబ్ధిదారులకు పింఛ‌న్లు మంజూరైన‌ట్లు చెప్పారు. జగనన్న ప్రభుత్వంలో రాజకీయ బేధాలు లేకుండా అన్ని పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నారని తెలిపారు. అవ్వ,తాతలకు, వికలాంగులకు, వితంతువులకు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తూ వారి సంక్షేమానికి అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్రజలంతా అండగా ఉండి 2024 ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. 

తాజా వీడియోలు

Back to Top