నెలాఖ‌రులోపు పెన్నా బ్యారేజీ ప‌నులు పూర్తి

మంత్రి అంబ‌టి రాంబాబు
 

నెల్లూరు:  ఈ నెలాఖ‌రు లోపు పెన్నా బ్యారేజీ ప‌నులు పూర్తి చేసి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా  ప్రారంభిస్తామ‌ని  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు. నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట వద్ద గల పెన్నా బ్యారేజీ పనులను నెల్లూరు జిల్లా ఇంచార్జి మంత్రి  అంబటి రాంబాబు, నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్  పరిశీలించి, నిర్మాణ పనుల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని మంత్రి ఆదేశించారు. 

Back to Top