చిత్తూరు: కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఎవరు ఉన్నా ప్రత్యర్థిగానే చూస్తామని మంత్రి వ్యాఖ్యలు చేశారు. కుటుంబాల్లో చిచ్చుపెట్టడం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బాగా తెలుసని మంత్రి పెద్దిరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని అన్నారు. వైయస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిల.. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా పలువకు కాంగ్రెస్ దిగ్గజాల సమక్షంలో.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.. అంతేకాదు.. ఏపీలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందనే చర్చ సాగుతోంది. అయితే, ఈ పరిణామాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాట్ కామెంట్లు చేశారు. మా కాళ్లను మేం నరుక్కోం.. కాంగ్రెస్ పార్టలో ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అన్నారు. రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం.. సీఎం వైయస్ జగన్ మా నాయకులు ఆయన కోసం మేం ఎప్పటికీ పని చేస్తూనే ఉంటాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇలా ఎన్ని పార్టీలు వచ్చినా మేం, మా ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంటే నడుస్తాం అన్నారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. రాష్ట్ర ప్రజలందరూ సీఎం వైయస్ జగన్ ను గెలిపించాలని చూస్తున్నారని స్పష్టం చేశారు. జెడ్పీటీసీగా ఓడిన వ్యక్తిని మేం ఎమ్మెల్యేగా గెలిపించాం.. ఇలాంటివి మాట్లాడే ముందు ఆలోచన చేయాలన్నారు. ఎవరో రెచ్చగొడితే అలా మాట్లాడటం సబబు కాదు అని.. ఇప్పటికైనా అయన పునరాలోచలో చేయాలని కోరుకుంటున్న.. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. గతంలో మా నాయకుడు వైయస్ జగన్ పై అక్రమ కేసులు బనాయించి 16 నెలలు జైలుపాలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.