సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఫ్లెక్సీకి పాలాభిషేకం

జీతాల పెంపు ప‌ట్ల పారిశుద్ధ్య కార్మికుల హ‌ర్షం

విశాఖ‌: పారిశుద్ధ్య‌ కార్మికుల వేత‌నం రూ.21 వేల నుంచి రూ.24,500కు పెంచ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు. వేత‌నాలు పెంచుతూ ప్ర‌భుత్వం జీవో విడుద‌ల చేయ‌డం ప‌ట్ల ఆ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం ఆనందరావు ఆధ్వర్యంలో పద్మనాభపురం వద్ద  రాజ్యసభ సభ్యులు , పార్టీ ఉమ్మడి విశాఖ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ  సుబ్బారెడ్డిని స‌త్క‌రించి, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆనంద‌రావు మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులకు, యూజీడీ కార్మికుల‌కు, డ్రైవ‌ర్ల‌కు జీతాలు పెంచిన ఘ‌న‌త సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌న్నారు.  ఈ ప్రభుత్వంలో 75 శాతం వేత‌నాలు పెరిగాయ‌ని సంతోషం వ్య‌క్తం చేశారు.  పారిశుధ్య కార్మికులకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ప్ర‌భుత్వానికి అంద‌రం అండ‌గా ఉంటామ‌ని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆర్ సత్యం, కనకరాజు, రామకృష్ణ,  శ్రీను, ప్రసాద్,  రఘు, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Back to Top